మనవాళ్లు ఎవ్వరికీ ఇలాంటి చావు రాకూడదు అంటే చెప్పేది వినండి దయచేసి ..!

-

కరోనా వైరస్ కి కనికరం లేదు. దేశ ప్రధాని నుండి పేదవాడి వరకు ప్రపంచంలో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈ వైరస్ కి వ్యాక్సిన్ లేకపోవడంతో నియంత్రణ ఒకటే కావడంతో…ప్రపంచ దేశాలు అన్ని దాదాపు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ వల్ల ఎవరైనా చనిపోతున్నా గాని పాజిటివ్ కేసి వచ్చినా కానీ సదరు కుటుంబ సభ్యులని మరియు ఆ వ్యక్తిని సమాజం చాలా చిన్న చూపు చూస్తోంది. కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా తమ నివాసం ఉంటున్న చుట్టుప్రక్కల ప్రజల నుండి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అంటరానితనం గా కరోనా వైరస్ వైద్యం చేసే వైద్యులను, వ్యాధిగ్రస్తులను సమాజం చూస్తోంది. ఎంత డబ్బు ఉన్నా గాని పరపతి ఉన్నా గాని కుటుంబ సభ్యులు కూడా…సొంత రక్త సంబంధి మృతదేహం చూడటానికి ధైర్యం చేయలేక పోతున్నా ఘటనలు దేశంలో అనేకం ఉన్నాయి.Health workers 'will be prioritised' for coronavirus testing ...తాజాగా ఇటువంటి ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ప్రముఖ వైద్యుడు నెల్లూరు జిల్లాలోనే డబ్బు పరంగా పరపతి ఉన్న వ్యక్తి రాజకీయంగా కూడా మంచి పేరున్న వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. దీంతో వెంటనే సదరు వైద్యుడిని కుటుంబ సభ్యులు…చెన్నై ప్రాంతంలో ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో వెంటనే చెన్నై ప్రభుత్వం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మెరుగైన చికిత్స అందించినప్పటికీ చివరాఖరికి కరోనా వైరస్ తో పోరాడలేక మరణించారు.

 

దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చనిపోయిన మృతదేహాన్ని వదిలిపెట్టి ఎవరికి వారు వెళ్లిపోయారు. అటువంటి సమయంలో చెన్నై మునిసిపల్ సిబ్బంది పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. డబ్బు, రాజకీయం పైగా వైద్యం తెలిసిన వ్యక్తికి కూడా ఇటువంటి చావు రావడంతో సొంత కుటుంబ సభ్యులు వదిలేసిన తీరుపై శవాన్ని చూస్తూ చుట్టుపక్కల ప్రజలు…అయ్యో పాపం అంటూ కంటతడి పెట్టారు. ఇటువంటి చావు మన చుట్టుపక్కల గానీ మన వాళ్లకు గాని రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం సూచించిన సూచనలు పాటించాలి. సోషల్ డిస్టెన్స్, ఎప్పటికప్పుడు చేతుల పరిశుభ్రత వంటివి చేస్తే ఇటువంటి దిక్కుమాలిన చావు రాకుండా ఉంటుంది. 

Read more RELATED
Recommended to you

Latest news