డియే విషయ౦లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ తీసుకునే వాళ్లకు షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. మార్చి 13న కేంద్ర కేబినెట్ డియర్నెస్ అలవెన్స్-DA ను 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తో కేంద్ర ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.14,510 కోట్లు భారం పడే అవకాశం ఉందని అంచనా వేసారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు ఆపేశారు.
ఈ నేపధ్యంలో డియే అమలు విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనిని ఆలస్యంగా అందించాలి అని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 1.13 కోట్ల మంది ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒకరకంగా బిగ్ షాక్ అని అంటున్నారు. 2020 జనవరి 1 నుంచి డియేలో మార్పులు అమలులోకి వస్తాయి. ఏప్రిల్ వేతనం సవరించిన డీఏ ప్రకారం రావాల్సి ఉంటుంది.
అదే విధంగా గత మూడు నెలల బకాయిని కూడా కేంద్రం చెల్లించాలి. మార్చి 13న ఆమోదముద్ర వేసిన డీఏను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఖరారు చేయలేదు. మాములుగా అయితే లాక్ డౌన్ లేకుండా అంతా సవ్యంగా ఉండి ఉంటే… మార్చి 24 నుంచి లాక్‌డౌన్ కారణంగా పన్నులు తగ్గిపోవడం, నిధుల కొరత ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చులను రద్దు చేసుకుంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో 40% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.