పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అనగానే… కథ ఎలా ఉంటుంది… హీరోయిన్ ఎవరు, ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, సినిమా టైటిల్ ఏంటీ అంటూ ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా పవన్ వకీల్ సాబ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత… అతను క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలై ఫస్ట్ షెడ్యుల్ కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమాలో ముందు కీర్తి సురేష్ ని తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఆ తర్వాత అనుష్క పేరు కూడా వినపడింది. ఆమె అందుకు నో చెప్పడం తో మరో హీరోయిన్ ని ఈ సినిమాలోకి తీసుకునే ప్రయత్నం చేసారు. తాజాగా అల వైకుంఠపురములో సినిమాలో నటించిన నివేథా పెతురాజ్ ని తీసుకున్నట్టు సమాచారం.
ఆమె తో ఇప్పటికే దర్శకుడు క్రిష్ మాట్లాడినట్టు సమాచారం. అందుకు పారితోషికం ఆమె భారీగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. విరూపాక్ష షూటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం వాయిదా వేసారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కు విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వకీల్ సాబ్ కూడా వచ్చే ఏడాదే వచ్చే అవకాశం ఉంది.