బ్రేకింగ్; కరోనా వ్యాక్సిన్ ఫెయిల్…

-

కరోనా వైరస్ కి మందు కనుక్కోవడానికి ఎన్నో దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, చైనా ఫ్రాన్స్, క్యూబా సహా అనేక దేశాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో మందు కనుక్కోవడానికి గాను తీవ్రంగా కష్టపడుతున్నాయి. చైనా, అమెరికా ‘రెమ్ డెసివిర్’ మందు కనుక్కున్నాయి. దీనికి సంబంధించి పరిక్షలు చేసాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కథనాన్ని పోస్ట్ చేసింది.

చైనాలో ఈ మెడిసిన్ ని 237 మంది రోగులపై పరిక్షలు చేసారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో 18 మంది రోగులకు మందుని ఇవ్వడం మానేశారు. నెల రోజుల అనంతరం కంట్రోల్ గ్రూప్ లోని 12. 8 శాతం రోగులతో పోల్చగా ఈ మందును తీసుకున్న రోగుల్లో 13. 9 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మందు తయారు చేసిన ఈ మందును ఉత్పత్తి చేస్తున్న ‘గిలీడ్ సైన్సెస్’ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ డేటా ఏదో ప్రయోజనాన్ని ఆశించి సేకరించిందే అయి ఉంటుందని, డేటా అర్థవంతంగా లేదని, ఈ స్టడీ అసంపూర్తిగా ఉందని గిలీడ్ సైన్సెస్ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ముందు నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెడిసిన్ బదులు తమ దేశంలోని కరోనా రోగుల కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ మందునే కావాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news