ప్రపంచమంతా కరోనా ని తక్కువ అంచనా వేస్తోంది ?

-

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రపంచ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. నవంబర్ లో చైనా దేశం లో బయట పడిన ఈ వైరస్ కేవలం ఐదు నెలల్లో ప్రపంచంలో ఉన్న 200 దేశాలకు పైగానే విస్తరించింది. ఆర్థికంగా మరియు సైనిక పరంగా తాము ఎంతో అభివృద్ధి చెందము మాకు తిరుగులేదు అని అనుకున్న దేశాలలో ప్రస్తుతం ఆకలి కేకలు పుట్టించే విధంగా దిగజార్చింది.WHO officials: Coronavirus seems to be spreading more slowly now ...అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇలాంటి టైమ్ లో ఎప్పటినుండో లాక్ డౌన్ అమలు చేస్తున్న దేశాలు ఎత్తేయాలని సమాలోచనలు చేస్తున్న ఈ సమయంలో WHO డైరెక్టర్ టెడ్రోస్ అధోనామ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దయచేసి లాక్ డౌన్ ఎత్తేసి తప్పు చేయొద్దని దేశాలకు పిలుపునిస్తోంది. ప్రపంచమంతా ఈ భయంకరమైన వైరస్ ని చాలా తక్కువ అంచనా వేసింది… కానీ ఇది మనతోనే ఉండే వైరస్ అని షాకింగ్ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఇది చాలా దేశాల్లో ప్రాథమిక దశలోనే ఉందని.. రానున్న రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందంటూ పెద్ద బాంబే పేల్చారు. రానున్న కాలంలో అమెరికా, ఆఫ్రికా లాంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరగనున్నట్లు చెప్పారు. కాబట్టి కరోనా వైరస్ బారిన పడిన ఎలాంటి దేశాలు అయినా తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి లాక్ డౌన్ ను ఎత్తి వేసే దిశగా అడుగులు వేస్తే, మూల్యం ఊహించని విధంగా చెల్లించుకుంటారు అని WHO డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news