ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్..?

-

అరవింద సమేత సక్సెస్ మీట్ లో బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ కలిసి వేదిక మీద కనబడటం కొన్నాళ్లుగా నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయని చెప్పొచ్చు. బాలయ్య అయితే వచ్చాడు కాని ఎన్.టి.ఆర్ గురించి ఫ్యాన్స్ తో ఏం మాట్లాడలేదు అన్న అసంతృప్తి ఉంది. అయితే ఎలాగు బాబాయ్, అబ్బాయ్ కలిశారు కాబట్టి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కూడా జూనియర్ ఉంటాడన్న వార్తలు వస్తున్నాయి.

అభిమానుల కోసం కలిశాం అన్నట్టు ఉన్నరే తప్ప ఇద్దరు నిజంగానే కలివిడిగా ఉన్నారన్నది ఇంకా డౌటే అంటున్నారు కొందరు. అందుకు కారణం ఎన్.టి.ఆర్ పేరు ఎత్తకుండా బాలయ్య 20 నిమిషాల స్పీచ్ ఇవ్వడమే. అయినా ఎన్.టి.ఆర్ సినిమాలో ఆల్రెడీ కాస్ట్ ఓకే అయ్యింది. దానిలో మరెవరు ఉండే అవకాశం లేదు. అలాంటిది జూనియర్ ఎన్.టి.ఆర్ ఎలా ఆ సినిమాలో ఉంటాడని మరికొందరు అంటున్నారు.

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఎన్.టి.ఆర్ ఉంటే బిజినెస్ పరంగా కూడా క్రేజ్ ఉంటుందని జూనియర్ ను తీసుకుంటున్నారట నిర్మాతలు. మరి బాలయ్య దానికి ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news