వామ్మో ఏపీ రాజ్ భవన్ లో కరోనా, జగన్ కీలక ఆదేశాలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఏపీ సర్కార్ కంగారు పడుతుంది. ఇప్పటి వరకు సామాన్యులకు మాత్రమే పరిమితం అయిన కరోనా కేసులు అధికారులకు కూడా వ్యాపించడం భయపెడుతుంది. ఏకంగా రాజభవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా రావడమే కాదు అందులో ఒక చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ కూడా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇప్పుడు గవర్నర్ కి కూడా కోరోనా పరిక్షలు చేయడం లేదా, ఆయన్ను హోం క్వారంటైన్ లో ఉండమని సూచించే అవకాశాలు కనపడుతున్నాయి. గవర్నర్ వయసు 80 ఏళ్ళు పైనే. ఆయనకు గనుక సోకితే మాత్రం చేసేది ఏమీ ఉండదు. ఆయన ప్రాణాలకు కూడా ముప్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనితో ఇప్పుడు ప్రభుత్వం రాజభవన్ కి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని చూస్తుంది.

ప్రత్యేక వైద్యులను కూడా రాజభవన్ లో ఉంచాలని జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాజభవన్ పరిస్థితుల మీద కేంద్రం కూడా ఆరా తీస్తుంది. అసలు వాళ్లకు ఎలా కరోనా సోకింది, వాళ్ళు గవర్నర్ కి దగ్గరగా ఉన్నారా అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. గవర్నర్ కుటుంబ సభ్యులను కూడా ఇప్పుడు క్వారంటైన్ లో ఉంచే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news