మన వ్యాక్సిన్ మీద కన్నేసిన బ్రిటన్, అమెరికా

-

కరోనా వైరస్ మందు కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి గానూ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిక్షలు జరుగుతున్నాయి. అయినా సరే కరోనా మందు మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏ విధంగా చూసినా కనపడటం లేదు. అయితే మన దేశంలో కరోనా వ్యాక్సిన్ ని తయారు చేయడానికి గానూ కీలక అడుగు పడింది.

పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కంపెనీ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్‌ను త్వ‌ర‌లో ప్రారంభిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై సంస్థ సీఈఓ అద‌ర్ పూనావాలా మాట్లాడుతూ… చాలా త‌క్కువ ధ‌రకే క‌రోనా వ్యాక్సిన్‌ను అందిస్తామ‌ని, అందుకు గాను ఇత‌ర మందుల త‌యారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశామ‌ని ఆయన పేర్కొన్నారు.

దేశ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్‌ను రూ. వెయ్యికే అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ఆయన చెప్పారు. మొద‌టి ద‌శ‌లో నెల‌కు 10 మిలియ‌న్ల డోసుల‌ను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. త‌రువాత నెల‌కు 20 నుంచి 40 మిలియ‌న్ల డోసుల‌ను త‌యారు చేస్తామ‌ని వివరించారు. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నాటికి 2-4 కోట్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని ధీమా వ్యక్తం చేసారు. వ‌చ్చే నెల‌లో మ‌నుషుల‌పై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తామని అన్నారు.

అయితే ఈ వ్యాక్సిన్ మీద బ్రిటన్ కన్నేసినట్టు సమాచారం. తాము దీన్ని కొనుగోలు చేయడానికి గానూ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ. తాము కూడా పరిక్షలు చేస్తామని శాంపిల్స్ ఇవ్వాలని కూడా ఆ దేశం విజ్ఞప్తి చేసింది. ఈ విషయం తెలిసిన అమెరికా కూడా దీనికి సంబంధించి ఆరా తీసినట్టు సమాచారం. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మోడికి ఫోన్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news