శాఖల విషయంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయ౦ తీసుకున్నారు. తన వద్ద ఉన్న ఒక కీలక శాఖను మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి ఇస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు కీలకమైన పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ బాధ్యతలను ఆయనకు కేటాయిస్తూ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గౌతం రెడ్డి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర శాఖలకు మంత్రిగా ఉన్నారు.
తన మీద ఉన్న ఒత్తిడి ని తగ్గించుకోవడానికి గానూ సిఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ నిర్వహిస్తున్న మార్కెటింగ్ శాఖతో పాటుగా, గౌతమ్‌రెడ్డి నిర్వహిస్తున్న ఆహారశుద్ధి విభాగాన్ని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా పాలనా పరంగా కాస్త ఇబ్బందులు తప్పుతాయని భావించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మేకపాటి గౌతం రెడ్డి యువకుడు కావడంతో ఆయనకు ఈ శాఖలను అప్పగించారు. అలాగే ఉన్నత విద్యావంతుడు కూడా కావడం కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు అయిన గౌతం రెడ్డి 2014,2019 లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆయనకు కేటాయించిన శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.