ఇప్పుడు లాక్ డౌన్ లో చాలా తక్కువగా జరుగుతున్నాయి. ప్రజలు అందరూ ఇళ్ళల్లో ఉండటం, పోలీసులు అందరూ కూడా ఎక్కడిక్కడ ప్రజలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవడం తో జనాలు బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో కూడా ఈ మధ్య ఒక భారీ దొంగతనం జరిగింది. ముంబై లో జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏడు కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను కొట్టేసారు. కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. గత నెల 22న బాధితుడైన నగల వ్యాపారి 7 కోట్ల విలువ అయిన బంగారం పోయింది అని ఫిర్యాదు చేసారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు… ముంబై నగరంలో ఉండే ఓ ఎన్జీవో అధ్యక్షుడు విపుల్ ఆనంద చంబ్రియను సహా మరో మరో ఆరుగురుని అరెస్ట్ చేసి 5.30 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఇదే కేసులో విచారణ చేయగా పోలీసు కానిస్టేబుల్ సహకారం ఉందని గుర్తించి సంతోష్ రాథోడ్ అనే కానిస్టేబుల్ ని అరెస్ట్ చేసారు. నిందితుడు నుంచి రూ.80 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. రాథోడ్‌తో పాటు గా నగల దుకాణం ఉన్న హౌసింగ్ సొసైటీలోని స్వీపర్ పంకజ్ రాంలివర్ గౌడ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ దొంగతనం మొత్తానికి కానిస్టేబుల్ సహకారం ఉందని పోలీసులు గుర్తించారు. పెట్రోలింగ్ లేని సమయాన్ని దొంగలకు చెప్పాడు అని అప్పుడు దొంగతనం జరిగింది అని పోలీసులు తేల్చారు.