కేసీఆర్ నిర్ణయాలను గమనిస్తున్న కేంద్రం…?

-

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ని పెంచడం ఏమో గాని ఇప్పుడు దేశ వ్యాప్తంగా అది సంచలనం అవుతుంది. కేంద్రంతో సంబంధం లేకుండా కరోనా కట్టడి విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్… ఇప్పుడు లాక్ డౌన్ ని ఈ నెల చివరి వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రం కూడా అదే విధంగా నిర్ణయం తీసుకుని జూన్ 3 వరకు లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉన్నాయి.

గత పది రోజుల్లోదాదాపు 20 వేల కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు లాక్ డౌన్ ని ఎత్తేస్తే మాత్రం పరిస్థితి ఊహకు కూడా అందదు. ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో కేసీఆర్ సూచనలను సలహాలను కేంద్రం తీసుకుంటుంది అని అయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే జాగ్రత్తగా గమనిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు ఆయన లాక్ డౌన్ ని పెంచాలి అని నిర్ణయం తీసుకున్నారు. అంటే మిగిలిన రాష్ట్రాలు కూడా మానసికంగా దాదాపుగా సిద్దం అయ్యాయి.

కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఏపీలో ఏదోక రూపంలో అమలు జరుగుతుంది. అలాగే తెలంగాణా సరిహద్దుని పంచుకుని ఉన్న మూడు నాలుగు రాష్ట్రాలు కూడా ఆయన తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. లాక్ డౌన్ ని ఏపీ కూడా పెంచే అవకాశం స్పష్టంగా ఉంది. కేంద్రం కూడా ఈ నెల 15 తర్వాత లాక్ డౌన్ ని పెంచుతూ మరోసారి ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news