కూరగాయల ధరలు పది రూపాయలు పెరిగితేనే మన కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి..కొనిదేలా తినేదెలా అంటాం.. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ధర చూస్తే.. ఆకాశాన్ని అంటడం కాదు.. ఏకంగా చంద్రమండలంలోకి వెళ్లాయి అంటారేమో కదా..! బంగాళదుంపలు కేజీ రూ.50 వేలు. రూపాయలు కాదండీ.. వేలు. ఏంటీ షాకయ్యారా..? మన దగ్గర కాదులే..
ఈ దుంపలను ఫ్రాన్స్‌లో లా బొన్నొట్టే అంటారు. వీటిని ఇండియాలో సాగు చెయ్యట్లేదు. ఫ్రాన్స్‌లో కూడా దేశమంతా కాదు.. అక్కడి ఇలే డీ నాయిర్మౌషియర్ అనే దీవిలో మాత్రమే వాటిని సాగుచేస్తారట. ఆ దీవిలో ఓరకమైన ఇసుక నేల ఉంటుంది. ఆ నేలలో వాటిని సాగు చేస్తున్నారు. ఆ దుంపల కోసం ఎరువులు, పురుగుమందులు వాడరు. సముద్రంలో లభించే ఓ రకమైన గడ్డినే ఎరువుగా వేస్తారు.. అంతేకాదు.. 50 చదరపు మీటర్ల ప్రదేశంలో మాత్రమే ఆ దుంపలను సాగు చేస్తున్నట్లు సమాచారం.
ఈ దుంపలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే.. ఇవి సంవత్సరమంతా లభించవట. ఏడాదిలో 10 రోజులు మాత్రమే లభిస్తాయి. సాగు ప్రారంభించిన 3 నెలల తర్వాత దుంపలు చేతికొస్తాయి. ఏటా ఫిబ్రవరిలో ప్రారంభిస్తారు. మేలో దిగుబడి వస్తుంది. చేతులతోనే వీటిని ఇసుక నుంచి బయటకు తీస్తారు.
రుచి కూడా యావ్రేజ్ కానీ అంత కాస్ట్ ఎందుకు..?
ఈ దుంపల రుచి ఏమంత ప్రత్యేకంగా ఉండదు. ఉప్పగా ఉంటాయి. కాకపోతే.. ఇవి కొన్ని రకాల వ్యాధులను నయం చేయడంలో బాగా పనిచేస్తున్నాయని స్థానికులు చెబుతారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ దుంపల ధర కేజీ 500 యూరోలకు పైగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.43వేలు. ఒక్కోసారి వీటి ధర రూ.50వేల దాకా పలుకుతుంది.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన 5 కూరగాయల్లో ఈ దుంపలు కూడా చేరాయట.. వీటిని సలాడ్లు, సూప్‌లు, క్రీమ్స్, ప్యూరీల్లో వాడుతున్నారు. అలాగే మందుల తయారీలోనూ వాడుతున్నారు. ఈ దుంపలను ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కొనవచ్చు. ధర రూ.50వేలకు పైగానే ఉంటుంది మరీ..