పంటకు ఎలుకల బెడద తప్పేదెలాగంటే..?

-

పంట పొలలాకు పక్షులు, కోతులు, ఎలుకల బెడద ఎక్కువ. వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు పడే తంటా అంతాఇంతా కాదు. వీటివల్ల పంట ఉత్పత్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా వరి పంటకు ఎలుకల బెడద పెద్ద సమస్యగా మారింది. ఎలుకలను చంపినా.. మళ్లీ కొత్తవి వస్తూనే ఉంటాయి. వీటిని శాశ్వతంగా నివారించడం ఎలాగంటే.. ?

 

మొదటి రోజు ఎలుకల కన్నాలను గుర్తించి మట్టితో మూసివేయాలి.

రెండోరోజు ఎలుకల కన్నాలలో బ్రోమోడయోలోన్ మందు, వరి నూక, వంట నూనె కలిపిన ఎరను కన్నానకి 10 గ్రా చొప్పున పెట్టాలి.

వారం తర్వాత మళ్లీ బ్రోమోడయోలోన్ మందుతో కూడిన ఎరను కన్నానికి 10గ్రా చొప్పున పెట్టాలి.

ఇక ఎలుకలను చంపడానికి ప్రభుత్వం ఉచ్చులను, విషపు బిళ్లలను రైతులకు సరఫరా చేస్తోంది. ఎరుకల మందును పొలంలో, గట్ల మీద పెట్టడం ద్వారా వాటిని తిని ఎలుకలు చచ్చిపోతాయి. ఎలుకల మందును జొన్న లేదా సజ్జ పిండితో కలిపి ఒక ప్లాస్టిక్ కవర్ లో ఉంచి చెట్టు మీద పెడతారు. ఎలుకలు వాటిని తినడం వల్ల చచ్చిపోతాయి. వేయించిన వేరుశనగ పప్పు పొడి, నువ్వులు, ధనియాలు, ఎలుకలమందు మిశ్రమాన్ని బట్టతో ఒక చిన్న మూట కట్టి, చెట్టుపై ఉంచుతారు. వీటిని తినడం వల్ల ఎలుకలు మరణిస్తాయి.

ఇక ఎలుకలను నివారించడానికి ప్రత్యేకమైన బోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ బోనులో కొబ్బరి ముక్కను పెడతారు. వాటిని తినడానికి ఎలుకలు వచ్చి బోనులోనే చచ్చిపోతాయి. ఈ బోనుద్వారా 3-4 ఎలుకలను పట్టి, చంపవచ్చు. ఈ బోను ఖరీదు రూ.40 వరకు ఉంటుంది. ఇక బొరియల్లో పొగబెట్టడం వల్ల వేడికి తగ్గుకోలేక ఎలుకవలు చనిపోతాయి.

ఎలుకల్లో మూడు జాతులు ఉన్నాయి. పందికొక్కు, చిన్న పందికొక్కు, ఇళ్లలో తిరిగే ఎలుకలు. ఇవన్నీ పంటను నాశనం చేసేవే. ఎలుకల మందు పెట్టడానికి ఎకరానికి రూ.250, బుట్టల్లో పడిన ఒక్కో ఎలుకకు రూ.20 చొప్పున ఖర్చు అవుతుంది. మొత్తమ్మీద వీటి నివారణకు ఎకరాకు రూ.1500 వరకు భారం పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news