నువ్వుల పంటలో ఈ మెలుకువలు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చు..

-

మన రాష్ట్రంలో ఎక్కువ వాణిజ్య పంటగా నువ్వులను పండిస్తారు. మంచి డిమాండ్ ఉన్నా కూడా పంటను సరైన సమయంలో పండించకలేక పోతున్నారు.దానివల్ల దిగుబడి తక్కువగా ఉంటుంది.రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో 50 వేల టన్నుల దిగుబడితో పండిస్తున్నారు.నువ్వుల్లో నూనె శాతం 46-55, ప్రోటీను 20-25 శాతం ఉండడమే కాకుండా విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు పాలీఅన్‌సాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని, అతి తక్కువ సమయంలో, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్‌ మరియు రబీలో వర్షాధారంగా పండించిన దానికంటె రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినపుడు చీడ పీడల బెడద తక్కువగా ఉండి, విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు..ఈ పంటను ఎక్కువగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో పండిస్తున్నారు.

అనువైన నేల..

నువ్వుల మొక్క చాలా పలుచగా ఉంటుంది.వేసిన విత్తు బాగా మొలక ఎత్తడం కోసం నేలను బాగా సరి చెయ్యాలి.వేసవిలో లోతుగా దున్నడం, తర్వాత ప్లాంకింగ్ చేయడం ద్వారా మట్టిని సన్నటి నేల బాగా తయారవుతోంది. నీటి ఎద్దడి లేకుండా ఉండేలా భూములను చదును చేయాలి. అధిక తీవ్రతతో కూడిన వర్షపు తుఫానులు సాధారణంగా ఉండే ప్రాంతాలలో డ్రైనేజీకి సహాయపడటానికి భూములు రిడ్జ్ చేయాలి. ఒక రబీ పంటకు, 2-3 హారోయింగ్‌లు తరువాత లెవలింగ్ చేస్తే సరిపోతుంది. నాటడానికి ముందు, కలుపు మొక్కలను నాశనం చేయడానికి భూమిని దున్నాలి. నువ్వుల మొలకల ప్రారంభ పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది..అందుకే కలుపు తియ్యడానికి కష్టం అవుతుంది..అందుకే విత్తె ముందు కలుపు నివారణ మందులతో విత్తనాలను శుద్ధి చేసి వేయడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news