ఎనిమిది ఏళ్ల క్రితం అద్భుతమైన ఉద్యమం నిర్మించి.. రాష్ట్రం సాధించుకున్న అనేక మంది ఉద్యమ కారులకు, మేధావులకు ,న్యాయవాద మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు సీజేఐ ఎన్వీ రమణ. నేడు తెలంగాణ హైకోర్టులో కొత్త జ్యూడిషియల్ కోర్టులను సీఎం కేసీఆర్, సీజేఐ ఎన్వీ రమణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్ర భవిష్యత్ గురించి ఎన్నో సందేహాలు, ఎన్నో చర్చలు మధ్య ఈ రాష్ట్రం అవిర్భవించిందని ఆయన వ్యాఖ్యానించారు.
గత ఎనిమిది ఏళ్ల అనుభవం.. ఆ సందేహాలను పటా పంచలు చేశారని, రాష్ట్ర అభివృద్ధికి న్యాయ శాఖ అభివృద్ధి కూడా ముఖ్యం అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎన్వీ రమణ. న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువకావలనే ఉద్దేశ్యంతో సీజేఐగా నా శయా శక్తుల కృషి చేస్తున్నానని ఆయన వెల్లడించారు. న్యాయ సేవల వికేంద్రీకరణలో తెలంగాణ అడుగు వేసిందని, 13 జ్యూడిషియల్ యూనిట్ ఏకంగా 35 జ్యుడీషియల్ యూనిట్లు గా మారనున్నాయన్నారు. దేశంలో ఇంతా భారీ స్థాయిలో న్యాయ వికేంద్రీకరణ జరగడం ఇది మొదటిసారన్నారు.