శనగపంట సాగు పద్ధతులు,తెగుళ్ళ నివారణ చర్యలు..

-

శనగపంటను తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా పండిస్తున్నారు..అయితే గాలి ద్వారా వ్యాపించే తెగుళ్లు ఎక్కువ.వాటి వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు..శనగ పంటను సంక్రమించే వివిధ రకాల తెగుళ్ళకు సంబంధించి మొదలు కుళ్లు, వేరు కుళ్లు మరియు ఎండు తెగుళ్ళు వంటివి విస్తృతంగా వ్యాప్తిస్తాయి.గాలి ద్వారా సంక్రమించే తెగుళ్ళు వల్ల పంట దిగుబడుల పై ప్రభావం పడుతుంది. సరైన సమయంలో యాజమాన్య పద్దతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. వాతావరణ పరిస్థితుల కారణంగా శనగ పంటను గాలి ద్వారా ఆకులను ఆశించు తెగుళ్ళ ఉధృతి పెరుగుతుంది.

శనగను ఆశించే తెగుళ్లు :

బూజు తెగులు :ఈ తెగులు బొట్రైటీస్ సినెరియా అనే శిలీంద్రం వలన సంక్రమిస్తుంది. శనగ పైరు పూత దశలో వున్నప్పుడు ఆ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పూత పిందే దశలలో గాలిలో తేమ అధికంగా ఉంటే ఈ తెలుగు ఉధృతి అధికంగా ఉంటుంది. తెగులు ఆశించిన మొక్కలలో కాయలు ఏర్పడవు. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్నపుడు కాండము, ఆకులు, పూలు, కాయల పై ముదురు గోధుమ మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన లేత కొమ్మలు కుళ్ళి విరిగిపోతాయి. తెగులు నివారణకు నీటి పారుదల ప్రాంతాలలో ఆలస్యంగా విత్తడం, తక్కువ విత్తన మోతాదు మరియు మొక్కల వరుసల మధ్య సిఫారసు మేరకు దూరం పాటించడం ద్వారా శనగ పైరుని బూజు తెగుల ఉధృతి నుంచి తప్పించవచ్చు. ఈ తెగులు నివారణ కి థయోబెండజోల్ 200గ్రా. చొప్పున ఎకరానికి పిచికారి చేస్తే తెగుళ్లను అదుపులో ఉంచవచ్చు.

తుప్పు తెగులు: ఈ తెగులు యూరోమైసిస్ సైసేరి అరైటిని అనే శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఈ తెగులు ఆశిస్తుంది. చల్లని, తడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి కారణమౌతుంది. ఆకులపై గుండ్రని చిన్న గోధుమ రంగు పొక్కులు ఏర్పడతాయి.తెగులు నివారణకు ఎకరానికి హెక్సా కొనజోల్ 400 మి. లీ. లేదా ప్రోపికొనజోల్ 200 మి. లీ. లేదా ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ 160 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటికి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచ్చికారి చెయ్యాలి.

ఆకుమాడు తెగులు : ఈ తెగులు కొలిట్రోట్రైకామ్ డిమాంటియం అనే శీలింద్రం వలన సంక్రమిస్తుంది. ఈ తెగులు పంట కాలంలో ఎప్పుడైనా ఆశించవచ్చు. ఈ తెగులు విత్తనం మరియు నెల ద్వారా వ్యాప్తి చెందును. ఈ తెగులు ముందస్తుగా విత్తిన పొలాల్లో కనిపిస్తుంది. అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యాధి సోకె అవకాశము ఉంది. ఈ తెగులు ఆశించిన పొలంలో అక్కడక్కడ పూర్తిగా ఎండిపోయిన మొక్కలు మరియు పాక్షికంగా ఎండిపోయిన కొమ్మలు కనిపించును.దాని వల్ల ఆకులు పూర్తిగా ఎండిపోతాయి.హెక్సాకొనజోల్ 400 మి. లీ లేదా ప్రోపికొనజోల్ 200 మి. లీ. లేదా క్లోరోథయోనిల్ 400 గ్రా. చొప్పున ఎకరానికి పిచికారి చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news