అండుకొర్రల సాగుకు అనువైన నేలలు, తెగుళ్ల నివారణకు మేలైన పద్దతులు

-

నాచురల్ డైట్ ఫాలో అయ్యేవాళ్లు ఈరోజుల్లో.. మిల్లెట్ ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలోనే ఈ ఆహారానికి డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందులో అండుకొర్రెలు కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో.. రైతులు అండుకొర్రల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. లాభాలు కూడా ఈ సాగులో బానే వస్తున్నాయి. మంచి సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు.. అండుకొర్రెల సాగుకు అనుకూలం. ఈరోజు మనం ఈ సాగుకు అనువైన నేలలు, ఎదురయ్యే తెగులు గురించి చూద్దాం.

నేలలు :

తేలికపాటి ఇసుక నేలల్లో, ఒండ్రు నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. నేలలో ఉదజని సూచిక 5-6.5 ఉన్న భూముల్లో బాగా పండుతుంది. బాగా నీరు ఉండే ప్రాంతాల్లో లేక ఎడారి ప్రాంతాల్లో పెరగడం వల్ల పంటకాలంలో రెండుసార్లు వానపడితే సరపోతుంది.

అండుకొర్రల సాగులో వచ్చే తెగుళ్లు.. వాటి నివారణ పద్దతులు:

ఆకుమచ్చ తెగులు: ఇది శిలీంద్రం మొక్క అన్ని భాగాలకు ఆశిస్తుంది. ఆకులపై చిన్నచిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. వెన్నుపై గింజ నిండుకోక తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు మంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే సరి.
పాముపొడ తెగులు : ఈ వ్యాధి రైజోక్టోనియా సొలాని అనే శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు దుబ్బు చేసే దశ నుండి ఏదశలోనైనా ఆశించే ప్రమాదం ఉంది.. ఆకులు మీద, కాండం మీద, చిన్నచిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపి పెద్దవై పాముపొడ వంటి మచ్చలుగా అవుతాయి.. దీని నివారణకు హెక్సాకనజోల్ 2మి.లీ లీటరు నీటికి లేదా ప్రొపికొనజోల్ 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
తుప్పు తెగులు: ఆకుల అడుగు భాగంలో మరియు పై భాగాలపై పసుపు లేదా నారింజ రంగులో ఉండే బొబ్బల వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమంగా గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగులోకి మారతాయి. పై ఆకులపై తెగులు ఉద్ధృతి మరీ ఎక్కువగా ఉంటుంది.. దీని నివారణకు పొలం గట్లపై కలుపు లేకుండా శుభ్రం చేయాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 2.5గ్రా మాంకోజెబ్ తో విత్తన శుధ్ది చేయాలి. మాంకోజెబ్ 3గ్రా. లేదా ట్రైడిమార్ఫ్ 1మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

కలుపు యాజమాన్యం :

విత్తనం నాటిన తరువాత 25 రోజుల వరకు కలుపు రాకుండా నివారించినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. ఆ తరువాత పంట మొత్తం నేలపై అల్లుకొని పెరగడం వల్ల ఎటువంటి కలుపు సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news