వరి సాగుకు రోటావేటర్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా?

-

వరి సాగుకు దమ్ము చేయడం నుంచి నూర్చే వరకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత.. ఒక్క ఇదే కాదు ప్రతి పంటకు కూడా ఇదే సమస్య.. అందుకే ఇలాంటి సమస్య నుంచి బయట పడటానికి ఆంధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరి సాగులో రైతులుకు పలు రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి దీనికి సర్కారు సైతం రాయితీలను అందజేస్తోంది కొన్నిచోట్ల కష్టం హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సాగుదారులకు అద్దికి ఇవ్వడం కూడా జరుగుతుంది ..

వాటిని సకాలంలో వాడితే చాలు మంచి ఫలితాలను పొందవచ్చు.. వరిలో మనకి విత్తనం విత్తుకున్నపటి నుంచి ధాన్యాన్ని సంచుల్లో నింపేదాకా కూడా మనకి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వరి పొలాన్ని తయారు చేసుకోవడం అంటే దమ్ము చేసుకోవడానికి రోటోవేటర్లు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ఈ రోటోవేటర్లు మనకి నాలుగు చక్రాల డ్రైవ్ తో వచ్చే ట్రాక్టర్ కి తగిలించుకున్నట్లయితే దమ్ము పొలంలో చక్కగా దమ్ము చేసుకోవచ్చును , కేజ్ వీల్స్ తో చేసిన దానితో పోలిస్తే మనకి రోటోవేటర్తో చేసిన దమ్ము చేసిన పొలం ఎంతో మెత్తగా వస్తుంది , మనకి నీళ్లు నిలబడడానికి బాగుంటుంది..

అదే రోటోవేటర్ తో దమ్ము చేసినప్పుడు వరి పిలకలు యొక్క వేర్లు ఎంతవరకు ఉంటాయో అంతవరకు నీరు చక్కగా చేరుతుంది. రైతులు దమ్ము చేయడానికి నాలుగు చక్రాల డ్రైవ్ తో గాని లేక హాఫ్ కేజ్ ల ట్రాక్టర్ తో గాని రోటోవేటర్ ని వాడినట్లయితే ఈ చౌడు సమస్య బాగా తగ్గుతుంది.. ఎక్కువ సార్లు దమ్ము చెయ్యాల్సిన పనిలేదు.. కేవలం రెండు సార్లు రోటోవేటర్తో చేస్తే సరిపోతుంది. గడ్డి ఉన్నా చుట్టుకుపోదు, పొలంలోని గడ్డిని లేదా పచ్చిరొట్టను చిన్న చిన్న తునకలుగా చేసి కుల్లబెట్టడానికి, నేలను చదును చేయడానికి కూడా ఈ రోటోపడ్లర్ను ఉపయోగించవచ్చును… సులువుగా తక్కువ సమయంలో వరి నారు మడి పూర్తి అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news