మినుము పంటలో తెగుళ్ళ నివారణ చర్యలు..

-

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలలో మినుము కూడా ఒకటి..5.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వీటిని ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో పండిస్తున్నప్పటికీ పెసర సాగు ఎక్కువగా తెలంగాణ. రాయలసీమ ప్రాంతాలలో ఖరీఫ్లో, మినుము సాగు ఎక్కువగా కోస్తా ఆంధ్రలో రబీలో జరుగుతుంది. పెసర, మినుము స్వల్పకా లపు పంటలు. వీటిలో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు తప్పకుండా సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి..

పైరు పూత దశలో ఆకులపైన తెల్లటి బూడిద వంటి చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమంగా పరిమాణంలో పెరిగి ఆకు కిందివైపు కూడా ఆక్రమిస్తాయి. తెగులు తీవ్రత పెరిగేకొద్దీ ఆకుల పైభాగం, కింది భాగం కూడా పూర్తిగా బూడిద వంటి శిలీంద్రపు తో కప్పి ఉంటుంది. ఫలితంగా ఆకులు ఎండిపోతాయి. కాయల సంఖ్య, గింజల పరిమాణం తగ్గుతుంది. దిగుబడులు గణనీయంగా పడిపోతాయి.

మినుములో కృష్ణయ్య (ఎల్.బి.జి-17) రకం ఈ తెగులును తట్టుకుంటాయి. తెగులు ఆశించిన వెంటనే 15 రోజుల తర్వాత మరోసారి లీటరు నీటికి కార్బెండా జిమ్ ఒక గ్రాము లేదా థయోఫొనేట్ మిథైల్ ఒకగ్రాము లేదా ట్రైడిమార్చ్ రం ఒక మి.లీ. లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. చొప్పున కలిపి పైరుపై పిచికారి చేసి ఈ తెగులును చాలా సమర్థంగా నివారించవచ్చు.

వేరుకుళ్ళు తెగుల్లు..వీటి వల్ల ఇక చెట్లు పూర్తిగా ఎండిపోతాయి..వేర్లు, నేల మట్టానికి దగ్గరగా ఉన్న కాండం భాగం నల్లబడి కుళ్ళిపోతుంది. ఇటువంటి మొక్కలను వేర్లనుంచి నిలువునా చీల్చి చూస్తే లోపలి కణ జాలం ఎరుపు రంగుకు మారి కనిపిస్తుంది. చిన్న మొలకలలో కాండం, వేళ్లు పూర్తిగా కుళ్ళి మొక్క చనిపోతుంది. అధిక ఉష్ణోగ్రత, అనావృష్టి పరిస్థితులు ఈ తెగులు ఉదృతికి దోహదపడతాయి..

మినుములో ఎల్.బి.జి-61, ఎల్.బి.జి.168, ఎల్.బి.జి-618 రకాలకు రోగనిరోధక శక్తి ఉంది. కిలో విత్తనానికి 4 గ్రా. ట్రైకోడెర్మా విరిడి ఫార్ములేషన్+ 3 గ్రా. మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి ని చేస్తే ఈ తెగులు ఉధృతిని కొంతవ రకు అరికట్టవచ్చు తెగులు తీవ్రత ఎక్కువగా ఉండే నేలల్లో తప్పనిసరిగా పంటమార్పిడి పాటించాలి..

తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. ఆకుమచ్చ తెగుళ్ళలో సర్కో స్పోరా ఆకుమచ్చ, ఆంత్రక్నోస్, కొరినోస్పోరా ఆకుమచ్చ తెగుళ్ళు ప్రముఖమైనవి..

పైరు పూత, పిందె దశలో ఆకుల పైభాగంలో గోధుమ రంగులో గుండ్రటి చిన్నమచ్చలు ఈనెల మధ్య భాగంలో ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపి సైజు పెరిగి రాగి రంగు అంచుతో, మచ్చ మధ్యభాగంలో తెలుపు రంగులో ఉంటాయి. ఆకుల పైన అధిక సంఖ్యలో ఈ మచ్చలు ఏర్పడితే ఆకులు వాడి, ఎండి రాలిపోతాయి. కాయల సంఖ్య, గింజల సైజు తగ్గి,దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది..

తెగులు సోకిన మొక్కల ఆకుల అడుగు భాగంలో ముదురు గోధుమ లేక నల్లటి రంగులో గుండ్రటి మచ్చలు ఏర్పడ తాయి. తెగులు ఉధృతి పెరిగేకొద్దీ మచ్చల సంఖ్య పెరిగి పెద్దవై దాదాపు 15-20 మి.మీ. పరిమా ణంలో ఆకుల పైభాగాన్ని, అడుగు భాగాన్ని ఆక్రమిస్తాయి. ఫలితంగా ఆకులు పండి, రాలిపోతాయి. మొలక దశలో తెగులు ఆశిస్తే మొక్కలు ఎదగక కుంగిపోతాయి.ఇక కాయల పై కూడా ఈ తెగుల్ల ప్రభావం పడి దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది..మొక్కలకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే వ్యవసాయ నిపునుల సలహాలు తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news