టాప్‌ సెలబ్రెటీలు అంతా ఆక్సిజన్‌ ఫేషియల్‌ చేయించుకుంటున్నారు..?ఎందుకో తెలుసా..?

-

ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి అందరూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. 20లు దాటి 30ల్లోకొచ్చిన వారికి కొందరిలో కొలాజిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి ముఖంపై గీతలు, ముడతల్లాంటివి కొద్ది కొద్దిగా వస్తాయి. అలాంటి వారు, ముఖ్యంగా సెలబ్రిటీలు, హీరోయిన్లు ఆక్సిజన్‌ ఫేషియల్స్‌ని చేయించుకుంటారు. టాలీవుడ్‌ నుంచి, బాలీవుడ్‌, హాలీవుడ్‌ హీరోయిన్ల వరకు వీటిని ప్రయత్నిస్తున్నారు. అసలు ఆక్సిజన్‌ ఫేషియల్‌ అంటే ఏంటో? దాని వల్ల వచ్చే ప్రభావాలేంటో తెలుసుకుందామా..!

ఆక్సిజన్‌ ఫేషియల్‌ వల్ల ఉపయోగాలు :

మన శరీరం ఎప్పుడూ ఆక్సిజన్‌ కోసం తాపత్రయ పడుతుంటుంది. అందుకనే మనకు తెలియకుండానే మనం గాలి పీల్చి వదులుతూ ఉంటాం. అలాంటి ఆక్సిజన్‌ మన ముఖ కణాలకు సమృద్ధిగా దొరికితే ముఖ చర్మం బ్రైట్‌గా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఏజింగ్‌ చికిత్సలు చేయించుకునే వారు ఈ ఆక్సిజన్‌ ఫేషియల్స్‌ని చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వీటి వల్ల ముఖంపై వచ్చే గీతలు, ముడతల్లాంటివి తగ్గుముఖం పడతాయి. ముఖ కణాల్లోకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువల్ల కొలాజిన్‌ ఉత్పత్తి పెరిగి మరింత యవ్వనంగా కనిపిస్తారు. ముఖం కొద్ది సమయంలోనే ఎంతో హైడ్రేటెడ్‌గా అయి మంచి రంగులో మెరిసిపోతున్నట్లుగా మారుతుంది. గీతలు, మచ్చల్లాంటివి తగ్గినట్లు అవుతాయి.

ఆక్సిజన్‌ ఫేషియల్‌ ఎలా చేస్తారు :

స్పాలు, ప్రొఫెషనల్గా పని చేసే పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లలో ఈ ఆక్సిజన్‌ ఫేషియల్‌లు చేస్తారు. ముఖాన్ని క్లెన్స్ చేస్తారు. మృత కణాలు, ముఖంపై పేరుకుపోయిన దుమ్ము లాంటి వాటన్నింటినీ క్లెన్సర్‌ సహాయంతో శుభ్రపరుస్తారు. తర్వాత ముఖానికి సీరంలాంటి దాన్ని రాస్తారు. ఆ పైన హై ప్రెజర్తో ఆక్సిజన్‌ని ముఖంపైకి స్టీమ్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల కణాలు ఎక్కువ ఆక్సిజన్‌ని పీల్చుకుంటాయి. తర్వాత ముఖాన్ని మరోసారి శుభ్రం చేసి మాయిశ్చరైజర్‌ని రాస్తారు. ఈ ప్రాసెస్ అంతా దాదాపుగా అర గంట నుంచి గంట పాటు జరుగుతుంది.

దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా..?

సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్న వారికి ఈ ఫేషియల్‌ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఉన్నట్లుండి ముఖ రక్త కణాలకు ఎక్కువగా ఆక్సిజన్‌ అందే సరికి ముఖం ఎర్రగా మారుతుంది. కొన్ని గంటల పాటు అది అలా ఉండొచ్చు. కొందరిలో ముఖం చిన్నగా వాస్తుంది. కాబట్టి సెన్సిటివ్‌ చర్మం ఉన్న వారు ఈ చికిత్సను చేయించుకునే ముందు చిన్నగా ప్యాచ్‌ టెస్ట్‌ ఫేషియల్‌ చేయించుకోవడం ఉత్తమం. ఇక దీని కాస్ట్‌ విషయానికి వస్తే.. ఇండియాలో అయితే ఐదు వేల నుంచి 20 వేల రూపాయల మధ్యలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news