పొడువు జుట్టు కోసం అద్భుతమైన చిట్కా.. ఉసిరి నూనె!

-

జుట్టు పొడవుగా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. జుట్టు పెరగడం కోసం ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటారు. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు ఏర్పడటం వంటి అనేక సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యలు కలగకుండా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఉసిరితో ఇలా ట్రై చేసి చూడండి. ఉసిరితో ఈ చిట్కాలు పాటించడం వల్ల అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. మరి అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

ఉసిరి నూనెతో జుట్టు కుదుళ్ళకు బాగా మసాజ్ చేయడం ద్వారా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగు పరచడంతో పాటు జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్ సరఫరా చేయడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు.

ఉసిరిలో ఉండే ఫ్యాటీ ఆసిడ్స్ జుట్టు కుదుళ్ల లోకి చొచ్చుకొని పోయి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉసిరిలో ఐరన్ తో పాటు కెరోటిన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. కొద్దిగా శీకాకాయ పొడి, ఉసిరి పొడిల ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా అంటించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి. కనీసం వారానికి ఒకసారైనా ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఉసిరి కాయ తినడం వల్ల లేదా ఉసిరి రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్కాల్ప్ కి బాగా మర్ధన చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కొంతమందిలో అధిక చుండ్రు వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. అలాంటి వారు కొద్దిగా ఉసిరి పొడిని, రెండు టేబుల్ స్పూన్ల మెంతి పౌడర్ ను, కొద్దిగా గోరువెచ్చని నీటినితో కలిపి మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా బాగా నాననివ్వాలి. మరుసటిరోజు ఉదయం స్కాల్ప్ కు, వెంట్రుకలకు బాగా అంటించాలి. ఒక అరగంట ఆగిన తర్వాత చల్ల నీటి స్నానం చేయడం ద్వారా చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయడం మంచిది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా అందమైన, పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news