ముక్కు, చెంపల మీద కనిపించే మొటిమలని తగ్గించుకునేందుకు సాయపడే సాధనాలు..

Join Our Community
follow manalokam on social media

ముక్కు, చెంపల మీద ఏర్పడే మొటిమలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి ఒక పట్టాన వదలవు. చూడడానికి అంద వికారంగా కనిపించి తొందరగా తొలగిపోకుండా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మరి వీటి బారినుండి కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఏ సాధనాలు వాడితే ఈ సమస్య నుండి బయటపడవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

సన్ స్క్రీన్ లోషన్

బయటకి వెళ్తున్న ప్రతీసారీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మర్చిపోవద్ది. సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు డైరెక్టుగా చర్మం మీద పడి అనేక ఇబ్బందులకి కారణమవుతాయి. అందుకే బయటకి వెళ్ళిన టైమ్ లో సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఐతే ముక్కు, చెంపల మీద మొటిమలు ఏర్పడ్డ వారు జింక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ లోషన్ వాడడం ఉత్తమం. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలని దూరం చేస్తాయి.

కలబంద

కలబంద చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మీ చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ కలబంద పాత్ర ఎక్కువగా ఉంటుంది. ముక్కు మీద మొటిమలు ఇబ్బందిగా ఉంటే రోజూ కొద్ది సేపు కలబంద రసాన్ని మొటిమలు ఉన్న చోట మర్దన చేయాలి. ఆ తర్వాత ముఖం కడుక్కుంటే సరిపోతుంది.

షియా వెన్న

చర్మంలో ఇంకిపోయిన తేమని తిరిగి తీసుకురావడంలో షియా వెన్న చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ముక్కు మీద మొటిమలు తగ్గిపోతాయి.

కలేందులా

బంతిపువ్వుల నుండి లభించే కలేందులా ముక్కు, చెంపల మీద ఏర్పడే ఎరుపుదనాన్ని తగ్గించి మేలు కలిగిస్తుంది. దీనివల్ల చర్మం తేమగా మారుతుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...