హోమ్ ట్రిక్స్: కేవలం వంటల్లో కాదు బేకింగ్ సోడా తో ఇలా కూడా చేయొచ్చు…!

-

బేకింగ్ సోడాని మనం వంటల్లో ఉపయోగిస్తాం. బేకింగ్ సోడా లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. నిజంగా వంటల్లో మాత్రమే కాకుండా వివిధ రకాలుగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీని వల్ల సులువుగా మనకి పనులు కూడా పూర్తి అయిపోతాయి. మరి ఆ ట్రిక్స్ గురించి ఇప్పుడే చూసేయండి..!

పళ్ళ మీద మరకలు పోవడానికి :

కొంత మంది పళ్లపై మరకలు ఉంటూ ఉంటాయి. గార పట్టేయడం, మరకలు ఉండిపోవడం లాంటివి జరుగుతాయి. అటువంటి వాళ్ళు దీనితో దంతాలని తోమితే మంచి బెనిఫిట్స్ వస్తాయి. దీని కోసం మీరు కొద్దిగా నీళ్ళ లో బేకింగ్ సోడాని వేసి పేస్ట్ లాగ చేయండి. ఇప్పుడు బ్రష్ మీద దానిని పెట్టి మీ పళ్ళని క్లీన్ చేసుకోండి. దీని వల్ల పళ్ళు తెల్లగా ఉంటాయి. మరకలు కూడా పోతాయి.

బట్టలు ఉతకడానికి :

బేకింగ్ సోడా తో బట్టలు ఉతికితే కూడా బట్టలు మంచిగా ఉంటాయి. దీని వల్ల మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. బట్టలు శుభ్రంగా, ఫ్రెష్ గా ఉంటాయి. బట్టలు ఉతికినప్పుడు అరకప్పు బేకింగ్ సోడా వేసి ఉతికేయండి చాలు.

దురదలు తగ్గుతాయి:

బేకింగ్ సోడాని ఉపయోగించడం వల్ల దురదలు, మంట తగ్గుతాయి.ఏదైనా కీటకాలు మిమ్మల్ని కుట్టినప్పుడు చర్మంపై ఉండే దద్దుర్లు తొలగిపోతాయి. బ్యాక్టీరియాని తొలగించి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. ఎక్కడైతే మీకు కీటకాలు కుట్టి సమస్య ఉంటుందో అక్కడ బేకింగ్ సోడాని పేస్ట్ లాగ చేసి పెట్టండి. దీనితో మీకు మంచి రిలీఫ్ ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news