కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..? ప్రయోజనాలు తెలిస్తే అలా అస్సలు చేయరు..!

-

సాధారణంగా కరివేపాకు లేని కూరలు, వంటలు తయారు చేసుకోలేము. కరివేపాకు వంటలకు ఘుమ ఘుమలాడే సువాసన ఇవ్వడమే కాక రుచిని కూడా పెంచుతుంది. అంతేకాక కరివేపాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.కరివేపాకులో కోయినిజెన్ అనే గ్లూకోజైడ్ ఉంటుంది. దీని వల్లనే కరివేపాకు ప్రత్యేకమైన వంటల్లో వేసి నప్పుడు సువాసనను ఇస్తుంది.

- Advertisement -

కరివేపాకు చెట్టును ఈజీగా ఇళ్లల్లో పెంచుకోవచ్చు. ఇందులో శరీరానికి కావాల్సిన క్యాల్షియం,ఫాస్ఫరస్, సోడియం,ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.దీనిని రోజు వంటల్లో చేర్చుకోవడం వల్ల ఇన్ని ప్రోటీన్లు, న్యూట్రియాంట్లు మనకి అందినట్టే.కరివేపాకును రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్ ఏ పుష్కలంగా అంది కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిని పిల్లలకు రోజు పెట్టడం వల్ల వారి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా కరివేపాకు బాగా సహాయపడుతుంది.

చాలామంది గర్భిణీస్త్రీలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారు రోజు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో నాలుగు కరివేపాకులను, లేదా కరివేపాకు పొడిని వేసుకొని తినడం వల్ల ఐరన్ కంటెంట్ పెరిగి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.మధుమేహంతో బాధపడేవారు రోజు నాలుగు కరివేపాకులను పరగడుపున నమిలి మింగడం వల్ల, దీనిలో వున్న యాంటీ డయాబేటిక్ గుణాల వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకంతో ఇబ్బందిపడేవారు నాలుగు స్ఫూన్ ల నిమ్మరసానికి , తేనే ఒకస్పూను, కరివేపాకు రసం కలిపి రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది.

కరివేపాకులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉండడం వల్ల దీనిని రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ తో పోరాడి ఫ్రీ రాడికల్స్ ని నివారిస్తుంది. ఇందులో పైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. దీనివల్ల ఉబకాయంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.

ఒత్తిడి మూలాన తలనొప్పి రావడం సహజం. అలాంటి వారు గుప్పెడు కరివేపాకులను తీసుకొని, రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా చేసుకోవాలి. దానిని కాఫీ కి బదులు సాయంత్రం పూట సేవించడం వల్ల ఒత్తిడి తగ్గి,తొందరగా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.అంతేకాక జుట్టు ఎక్కువగా రాలుతూ ఉన్నట్టయితే వారు కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి మరిగించి వడకట్టి, దానిని కుదుళ్లకు బాగా మర్దన చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...