వాతావరణ మార్పుల నుండి చర్మాన్ని, జుట్టును సంరక్షించే అవొకోడో..

-

వాతావరణంలో మార్పులు రుతువు మార్పులకు సంకేతం. ఈ మార్పులు మనుషుల శరీరాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వాతావరణం మారుతున్నప్పుడు అలర్జీలు వస్తుంటాయి. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చర్మం, జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వాతావరణంలో మార్పుల ప్రభవానికి గురయ్యేది చర్మమే. కాబట్టి మీ దినచర్యలో అవొకోడోని భాగం చేసుకోవాలి.

దక్షిణ మధ్య మెక్సోకోలో కనుగొనబడిన ఈ పండు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇందులో ఉండే పోషకాల వల్ల అనేక చర్మ సంరక్షణ సాధనాల్లో వాడుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలోని మార్పులుమీ చర్మానికి, జుట్టుకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

చర్మాన్ని తేమగా ఉంచడానికి:

వాతావరణంలోని మార్పులకు గురై చర్మం పొడిబారుతున్నట్లయితే ఈ కింది పద్దతులు పాటించండి.

1టేబుల్ స్పూన్ అవొకోడో గుజ్జు తీసుకుని టేబుల్ స్పూన్ కలబంద రసంలో కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి వర్తించండి. 20నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ ప్రక్రియను వాడితే బాగా పనిచేస్తుంది కావాలంటే కొద్దిగా దోసకాయ రసం కూడా కలుపుకోవచ్చు.

చుండ్రు ఇబ్బంది పెడుతుంటే:

2టేబుల్ స్పూన్ల అవోకోడో తీసుకుని 1టేబుల్ స్పూన్ తియ్యటి పెరుగులో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 2-3చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ నెత్తిపై పూయండి. 45నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగి, ఆ తర్వాత షాంపూ చేసుకుంటే చాలు. ఈ వర్షాకాలంలో చర్మ, జుట్టు ఇబ్బందులను దూరం చేసుకోవడానికి అవొకోడో ఉపయోగించండి.

Read more RELATED
Recommended to you

Latest news