బంగాళదుంపతో కూర చేస్తున్నప్పుడు సాధారణంగా తొక్క తీసి పడేస్తుంటాం.. అయితే ఆ తొక్కతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బంగాళాదుంపలోని పోషకాలు చర్మ సమస్యలతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. సూర్యరశ్మి, కాలుష్యం, దుమ్ము ధూళి కారణంగా చర్మం దెబ్బతింటుంది. బంగాళాదుంపలో జింక్, ఐరన్, ప్రొటీన్, అజెలైక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కాంతి వంతంగా మారేందుకు సహాయపడుతుంది. డార్క్ స్పాట్‌లను ప్రకాశవంతంగా మారుస్తుంది.
బంగాళాదుంప రసాన్ని చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు, మొటిమల గుర్తులు డార్క్ ప్యాచ్‌లపై వేసుకుని అరగంట తర్వాత కడిగేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. బంగాళాదుంప తొక్కలు చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు, మొటిమల గుర్తులను తొలగిస్తుంది. ఇందులో ఉండే అజెలైక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. బంగాళాదుంపలో కాటెకోలేస్ వంటి బ్లీచింగ్ కాంపోనెంట్‌లు కూడా ఉన్నాయి. ఇది సన్‌స్పాట్‌లను, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
బంగాళదుంప తొక్కను టమోటా, పసుపుతో కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. దీనిని వారానికి ఒకసారి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు ఉంచాలి. బంగాళాదుంప తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఇది చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడతుంది.
బంగాళాదుంప తొక్క చర్మ కణాలకు ప్రోటీన్‌ను అందిస్తుంది. బంగాళాదుంపలోని విటమిన్లు, ఐరన్, మినరల్స్ చర్మ ఛాయకు సహాయపడుతాయి. బంగాళాదుంప తొక్కను రెగ్యులర్‌గా చర్మంపై అప్లై చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బంగాళాదుంపలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి సహజమైన బ్లీచింగ్‌గా పని చేస్తుంది. సన్‌టాన్‌ను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
బంగాళాదుంపను శుభ్రంగా కడిగి, తొక్క తీసి వేయాలి. తొక్కను ముఖంపై సున్నితంగా రుద్దాలి. అలా 5-10 నిమిషాలు చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది సన్‌బర్న్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
బంగాళదుంప తొక్కలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. ఈ సారి తప్పకుండా వాడి చూడండి. బంగాళదుంప తొక్క ఒక్కటే కాదు..అరటితొక్క కూడా అందానికి బాగా ఉపయోగపడుతుంది.