ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో నేడు టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న పాపులర్ విలన్ గా సోను సూద్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజి ఉంది..సినిమాల్లోకి హీరో అవుదామని ఎన్నో కలలతో ఇండస్ట్రీ కి వచ్చిన సోనూసూద్ చివరికి ఇండస్ట్రీ లో పెద్ద విలన్ అయినప్పటికీ, నిజజీవితం లో మాత్రం ఎంతో మంది నిస్సహాయలకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు ..కెరీర్ ప్రారంభం లో అడపాదడపా చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చిన సోనుసూద్ ని కోడి రామ కృష్ణ దర్శకత్వం లో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరుంధతి అనే చిత్రం వేరే లెవెల్ కి తీసుకెళ్లింది.. అంతకు ముందు ఆయన టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు.. అలాంటి సమయం లో వచ్చిన అరుంధతి సినిమా తర్వాత సోనూసూద్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..అరుంధతి సినిమాలో పశుపతి గా సోను సూద్ నటనకి భయపడని ప్రేక్షకుడు అంటూ ఎవ్వడు లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఈ సినిమా తర్వాత ఆయనకీ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు..బాలీవుడ్ , కోలీవుడ్ లలో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి.
అయితే సోను సూద్ కి అరుంధతి లో అవకాశం రావడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అట..ఎందుకంటే అంతకుముందు ఎన్టీఆర్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అశోక్ సినిమాలో సోను సూద్ విలన్ గా నటించాడు..ఈ సినిమాలో విలన్ గా సోను సూద్ అయితేనే బాగుంటుందని అడిగిమరీ పెట్టించుకున్నాడట ఎన్టీఆర్..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మంచి సినిమాగా నిలిచింది..అంతే కాకుండా సోను సూద్ ని నలుగురు దృష్టిలో పడేలా కూడా చేసింది ఈ చిత్రం..అలా ఈ సినిమాని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చూశారట..ఇందులో సోను సూద్ నటన ఆయనకీ బాగా నచ్చింది..మనం చేయాలనుకుంటున్న అరుంధతి సినిమాలో పశుపతి పాత్రకి సోను సూద్ అయితే బాగుంటుంది..ఒకసారి పరిశీలించండి అంటూ ఆ చిత్ర దర్శకుడు కోడి రామ కృష్ణ కి సూచించాడట..ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మరియు కోడి రామ కృష్ణ ఇద్దరు కలిసి సోను సూద్ ని కలిసి కథ వివరించడానికి వెళ్లారట.
కథ మొత్తం విన్న తర్వాత పశుపతి పాత్రకి నేను సరిపోనని..అఘోర పాత్ర నేను చేయలేనని చెప్పాడట సోను సూద్..అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ‘మీరు చెయ్యగలరు సార్..ఒక్కసారి మీకు ఆ గెటప్ వేస్తాము..ఆ గెటప్ చూసుకున్న తర్వాత కూడా మీకు నచ్చకపోతే ఇక మీ ఇష్టమొచ్చిన నిర్ణయం తీసుకోండి’ అని చెప్పారట..ఆ తర్వాత సోను సూద్ కి అఘోర గెటప్ వెయ్యడం..ఆయనకీ అది నచ్చడం..సినిమాకి సైన్ చేసి ఆ పాత్ర చెయ్యడం అన్ని చకచకా జరిగిపోయాయి..ఈ సినిమాలో నటించినందుకు గాను సోను సూద్ కి భారీ మొత్తం లో పారితోషికం కూడా ఇచ్చారు..20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినందుకు సోను సూద్ కి దాదాపుగా 45 లక్షలు ఇచ్చాడట శ్యామ్ ప్రసాద్ రెడ్డి..సోను సూద్ తన కెరీర్ లో తీసుకున్న అత్యధిక పారితోషికం ఇదేనట అప్పట్లో..ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత అనుష్క కి ఎంత మంచి పేరొచ్చిందో..సోను సూద్ కి కూడా అదే స్థాయి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి..ఆరోజుల్లోనే ఈ సినిమా 32 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది..అలా సోను సూద్ కి అరుంధతి సినిమాలో ఛాన్స్ దక్కడానికి జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా సహాయపడ్డాడు అనే చెప్పాలి.