శీతాకాలం వీచే చలిగాలులు చర్మాన్నే కాదు జుట్టుకి కూడా ఇబ్బంది తెచ్చి పెడతాయి. రుతువులకి అనుగుణంగా చర్మాన్ని సంరక్షించే పద్దతులు మారినట్టే జుట్టు సంరక్షణ పద్దతులు కూడా మారుతుంటాయి. శిరోజాల అందం చలికాలంలో పాడవకుండా మరింత అందాన్ని చేకూర్చడానికి ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే శిరోజాలకి మాస్క్ తయారు చేసుకునే పద్దతి ఏంటో చూద్దాం.
గుడ్డు
అరటి పండు
తేనె
గుడ్డులో ఉండే పోషకాలు శిరోజాల పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తల పై భాగంలో చల్లదనాన్ని కలిగిస్తాయి. తేనె కారణంగా శిరోజాలు తేమకి గురవుతాయి. అరటి పండులో ఉండే పొటాషియం జుట్టు పలచబడి విరిగిపోకుండా చూసుకోవడంతో పాటు చుండ్రుని పోగొడుతుంది.
తయారీ విధానం
మూడు పదార్థాలని ఒకే దగ్గర కలపాలి. అవన్నీ కలిసిపోయి ఒక మిశ్రమం లాగా తయారవ్వాలి.
ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకోవాలి. అలా ఒక 20నిమిషాల పాటు ఉండాలి.
ఆ తర్వాత షాంపూ లేదా కండీషనర్ తో స్నానం చేస్తే సరిపోతుంది.
ఈ మాస్కు ఎవ్వరికైనా బాగా పనిచేస్తుంది. చలికాలంలో జుట్టు సంరక్షణకి తోడ్పడటంలో ఎంతో సాయపడుతుంది. దీని ద్వారా శిరోజాలు మృదువుగా తయారవడంతో పాటు అందంగా నిగనిగలాడేలా ఉంటుంది. గుడ్డు, తేనె, అరటి లో ఉన్న పోషకలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచి, మిల మిల మెరిసేలా చేస్తాయి. చలికాలం అస్తమానం జుట్టు పాలిపోయినట్టు కమిపిస్తూ ఉంటుంది. దీని కారణంగా చాలా మంది వారంలో ఎక్కువ సార్లు షాంపూతో స్నానం చేస్తుంటారు. కానీ అదంత ఉపయోగకరంగా ఉండదు. ఇంకా, దాని పనితనం కేవలం టెంపరరీ మాత్రమే. అందుకే ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకునే మాస్క్ బాగా పనిచేస్తుంది. మరి ఇంకెందుకాలస్యం ప్రయత్నించండి.