సినిమాలకు దూరం అవుతున్న సమంత.. ఎందుకో తెలుసా…!?

-

ఏమాయచేసావే తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది అక్కినేని కోడలు సమంత .టాలీవుడ్‌లో హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు . కొత్త కొత్త అంశాలతో సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకుల మదిలో వేసుకుంది. దక్షిణాది స్టార్ హీరోల సరసన నటించిన సామ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఏ మాయ చేసావేలో హస్కీ వాయిస్‌తో కుర్రకారును హుషారెత్తించి… కుందనపు బొమ్మగా మారి అందరిని అలరించింది.

అయితే తన మొదటి సినిమా హీరో అక్కినేని అందగాడు చైతన్య తో కొన్ని రోజులు ప్రేమ నడిపి …పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు . పెళ్లి ఐన తర్వాత కూడా తన నటనకు పులిస్టాప్ పెట్టకుండా కంటిన్యూ చేస్తుంది .ఒక వైపు సంసారం భాద్యతలను మరో వైపు సినిమా లను సమ ప్రాధాన్యంగా చూస్తూ వచ్చింది. పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్ కు అడ్డంకి కాదని నిరూపించింది …కానీ ఏమైందో తెలియదు సడెన్గా సామ్ సినిమాలకు దూరం అవుతున్నారనే వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి .

ఎందుకంటే ఈ ఏడాది జాను సినిమా తర్వాత ఆమె మరో తెలుగు సినిమా ప్రకటించలేదు. దీంతో ఆమె ప్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. కాకపోతే తమిళ్‌లో మాత్రం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో విజయ్ సేతుపతి – నయనతారలతో కలిసి నటించనుంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టింది.వచ్చే జనవరిలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలవచ్చని సమాచారం. అయితే ఈ మధ్య సినీ కెరీర్ పరంగా సమంత కాస్త స్లో అయినట్లు అనిపిస్తోంది.సమంత గతేడాది ‘ఓ బేబీ’ ‘మజిలీ’ వంటి సినిమాల్లో నటించింది. వాస్తవానికి సమంత కంటే సీనయర్ హీరోయిన్లు జూనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ సమంత ఆహా యాప్ లో వచ్చే ‘సామ్ జామ్’ టాక్ షో లో మాత్రమేకనిపిస్తూ అలరిస్తుంది .దీంతో సమంత సినిమాలకు దూరం అవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది .

Read more RELATED
Recommended to you

Latest news