గర్భధారణ సమయంలో వచ్చే చర్మ సమస్యలకి చెక్ పెట్టండిలా..

-

గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. హార్మోన్లలోని మార్పుల కారణంగా ముఖం మీద మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి ఎలాంటి రసాయన క్రీములు వాడకూడదు. అది గర్భంలో బిడ్డకి హాని కలగవచ్చు. అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఐతే కొన్ని సహజ ఉత్పత్తులు వాడవచ్చు. అవి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉంచుతాయి. ముఖంపై వచ్చే మొటిమలు, నల్లమచ్చలు మొదలగు వాటిని పోగొట్టుకోవడానికి ఉపయోగపడే ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బాదం, తేనె

దీనికోసం బాదంలని ఒకరోజు ముందు రాత్రి నానబెట్టాలు 4-5బాదంలని నానబెట్టి వాటిపైన పొట్టు తీసివేసి గ్రైండర్ లో వేసి పొడిలాగా తయారు చేయాలి. ఆ తర్వాత దానికి కొద్దిగా తేనే కలుపుకుంటే పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత ఆ పేస్టుని ముఖానికి వర్తించుకోవాలి. పొడి చర్మం కారణంగా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంటే ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది.

అరటి పండు, తేనె

మీది జిడ్డు చర్మం అయితే గనక ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుండి. అరటి పండు, తేనె ఇంకా కొద్దిగా నిమ్మరసం కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. కొద్ది సేపయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

దోసకాయ, పుచ్చకాయ

దోసకాయ రసాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ రసాన్ని మరో రెండు టీ స్పూన్లు కలుపుకుని అందులో కొద్దిగా పెరుగు, కొద్దిగా పాలపొడి కలుపుకోవాలి. అప్పుడు వచ్చిన ఆ మిశ్రమాన్ని ముఖానికి వర్తించాలి. మెడ దాకా వర్తించుకుని 15నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news