వెల్లుల్లితో మొటిమలను ఇట్టే తొలగించుకోవచ్చు.. ఇలా చేద్దామా..!

ఉల్లిపాయతో జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.. మరి వెల్లుల్లి ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా ఏంటీ..! అందాన్ని పెంచుకోవడానికి వెల్లుల్లి నెంబర్‌ వన్‌గా పనిచేస్తుంది. దీంతో డబుల్‌ బెనిఫిట్స్.. ముఖానికి, కేశ సౌందర్యానికి కూడా వెల్లుల్లిని వాడేసుకోవచ్చు. మొటిమలను తొలగించటంలో అద్భుతంగా వెల్లుల్లి పనిచేస్తుంది. ఇంకా వెల్లుల్లితో ఎలాంటి ప్యాక్స్‌ వేసుకోవచ్చో చూద్దామా..!

వెల్లుల్లిని ఎలా వాడాలంటే..

వెల్లుల్లిని చిదిమి దాని నుండి రసాన్ని వేరు చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వెల్లుల్లి రసంలో తాజా కలబంద గుజ్జును కలపండి. ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే మొటిమలు తొలగిపోతాయి.

వెల్లుల్లి రెబ్బలను మిక్స్‌ చేసి అందులో వెనిగర్‌ కలిపి పేస్టులా వచ్చే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట కాటన్‌ బాల్‌తో రాయాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరుచూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఎగ్‌ వైట్‌ తీసుకోండి.. దానికి వెల్లుల్లి పేస్ట్ కలిపి ఈ మిశ్రమం చేసుకోండి. ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోతాయి.

జుట్టుకు కూడా వెల్లుల్లి మేలు చేస్తుంది.. జుట్టు ఊడ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బలహీన‌మైన చిగుళ్ళు. దీనికి ఆదిలోనే చెక్ పెట్టాలంటే కొబ్బరి నూనె, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి చేసి తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేసి తలస్నానం చేయటం వల్ల జుట్టు రాలటం ఆగిపోతుంది. అంతేకాకుండా వెల్లుల్లి ఉండే ఐరన్, మినరల్స్ జుట్టును పొడవుగా పెంచేందుకు తోడ్పడతాయి. వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి కండరాలూ, చర్మం, ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది..

కాబట్టి.. మొటిమలు తొలగించుకునేందుకు ఆఖరి ప్రయత్నంగా ఈ వెల్లుల్లి చిట్కాలను ట్రై చేయండి..! కొందరికి పెద్దగా పింపుల్స్‌ ఉండవు.. కానీ చాలామందికి. అదేదో ఉద్యమంలా మొఖం అంతా పింపుల్స్‌ వచ్చేస్తాయి. వాళ్లు పాపం చాలా క్రీమ్స్‌ వాడినప్పటికీ ఆశించినంత ఫలితం ఉండదు. హోమ్‌ రెమెడీస్‌ వల్లే సమస్య పూర్తిగా నయమవుతుంది.. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు.!

-Triveni Buskarowthu