ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలలో దురదకి కారణం అవుతున్నాయా? ఐతే ఈ పద్దతులు పాటించండి.

-

వేసవికాలంలో వేడి కారణంగా తలలో దురద సాధారణంగా వస్తుంటుంది. అధిక చెమట, చుండ్రు కారణంగా ఈ దురద రావడం సహజమే. కానీ ప్రతీసారీ ఇదే కారణం కాకపోవచ్చు. తలలో దురద రావడానికి కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా అయ్యే అవకాశం ఉంది. జుట్టు పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు కొన్ని పద్దతులు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. తలలో జుట్టు ఉన్న చోట ఈ ఇన్ఫెక్షన్లు దురదకి దారి తీస్తాయి. ఇలాంటప్పుడు జుట్టు విఛ్ఛిన్నం అవడం ప్రారంభం అవుతుంది. అపుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

చాలా సార్లు జుట్టుకి రంగు వేయడం వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని అలెర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. అందువల్ల మీరు వాడుతున్న ఉత్పత్తిని చెక్ చేసుకోండి.

వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. చర్మం పొడిబారడం వల్ల దురద కలుగుతుంటుంది. ఇంకా హెయిర్ స్టైలిస్ట్ సాధనాయిన స్ట్రెయిట్నర్ వంటి వాడకం తగ్గించుకుంటే మంచిది.

మరేం చేయాలి?

వారానికి కనీసం రెండు మూడు సార్లయినా షాంపూతో తలస్నానం చేయాలి.. దానివల్ల జుట్టులో ఉండే నూనెలు, చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. తలస్నానానికి వేడినీటిని ఉపయోగించవద్దు. దానివల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంది.

తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు నూనె అప్లై చేయండి. అంతకంటే ఎక్కువ సేపు నూనె అంటుకుని ఉండవద్దు. దుమ్ము, ధూళి జుట్టుని చేరే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. మీ దిండ్ల, తువ్వాళ్ళు ఇతరులతో పంచుకోవద్దు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే తలలో వచ్చే దురదలు తగ్గిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news