బాదం కుల్ఫీ.. ఇంట్లోనే తయారుచేసుకోవడానికి రెసిపీ..

-

ఉత్తర భారతదేశ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే బాదం కుల్ఫీకి దక్షిణాన కూడా మంచి పాపులారిటీ ఉంది. భోజనం చేసిన తర్వాత స్వీట్స్ ఇష్టపడేవాళ్ళు బాదం కుల్ఫీని ఇష్టంగా తింటారు. దీన్ని ఫలూడాతో కూడా వడ్డిస్తారు. ఇంట్లో తయారు చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా బాదం కుల్ఫీని ఆస్వాదించవచ్చు. ఇంట్లో తయారు చేసుకోవడానికి కావాల్సిన రెసిపీ ఏంటో ఇక్కడ చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

2కప్పులు బాదం (పొట్టు లేకుండా)
2కప్పుల గడ్డకట్టిన పాలు
1కప్పు సాధారణ పాలు
1కప్పు ఫ్రెష్ క్రీమ్
6పిస్తా ముక్కలు
కొద్దిగా కుంకుమ పువ్వు
3టేబుల్ స్పూన్ల ఉడికించిన బాదం

తయారీ విధానం

పాలు, బాదంలని ఉడకబెట్టాలి.

ఒక పెద్ద గిన్నె తీసుకుని పొట్టు లేని బాదం, క్రీమ్, గడ్డకట్టిన పాలు వేయాలి. చిక్కగా అయ్యే వరకు బాగా కలపి పక్కన ఉంచుకోవాలి. అపుడు, మరో పాత్ర తీసుకుని అందులో పాలు పోసి మరిగించాలి. మరుగుతున్న పాలలో కుంకుమ పువ్వు జోడించాలి. బాగా కలిపిన తర్వాత పాత్రని పొయ్యి మీద నుండి బయటకు తీసేయాలి.

కుల్ఫీ పాత్రలోకి మిశ్రమాన్ని పోయాలి

పాలు బాగా చల్లారిన తర్వాత బాదం మిశ్రమంతో కలుపుకోవాలి. అపుడు అది మంచి మిశ్రమంగా తయరవుతుంది. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని పిస్తా, బాదంలని వేయించాలి. ఇపుడు వీటిని కుల్ఫీ పాత్రలో వేయాలి. కుల్ఫీ పాత్రలో మిశ్రమం సరిగ్గా కలిసేలాగా కదిలించాలి.

ఇప్పుడు వీటిని 4గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తర్వాత మీకు నచ్చ్చిన వారికి సర్వ్ చేయండి. ఘుమఘుమలాడే అదిరిపోయే కుల్ఫీ మీ ఇంట్లోనే రెడీ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news