మందారపొడితో జుట్టు సమస్యలకు చెక్..పొడవైన జట్టు కాయం..!

-

లేడీస్ కి ఎక్కువగా తమ జుట్టు సంరక్షణమీదే ఇంట్రస్ట్ ఉంటుంది. ఈ మధ్య అబ్బాయిలకు కూడా శ్రద్ధ పెరిగిందనుకోండి. ఏం చేస్తాం..కాలుష్యం, ఒత్తిడి వల్ల జుట్టు అంతా ఊడిపోతుంది. కనీసం పెళ్లైయ్యే వరకైనా ఉంటే చాలురా దేవుడా అనుకుంటున్నారు చాలామంది. జుట్టు ఒత్తుగా, సాఫ్ట్ గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దానికోసం ఎన్నో ఆయిల్స్, షాంపూలు కూడా వాడే ఉంటాం. కొన్నిసార్లు వీటివల్ల లాభలమాట దేవుడెరుగు ఉన్నదికూడా ఊడిపోతుంది. పెరటి వైద్యం ఇప్పుడు చేదు అయింది కానీ, ఒకప్పుడు దాదాపు అన్నిరోగాలకు పెరటివైద్యమే వాడేవారు. దీనిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాకపోతే టైం పడుతుంది. పెయిషెన్స్ ఉండాలి అంతే. అయితే ఈరోజు మీ జుట్టుకోసం ఇంట్లో ఉండే వాటితో చేసే కొన్ని చిట్కాలను చూద్దాం.

పెరుగు, ఉసిరి, మందార పొడితో ఒత్తైన, పొడవాటి జుట్టు :

ఈ హెయిర్ మాస్క్‌ని ప్రయత్నిస్తే కచ్చితంగా మీ జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది. అదే విధంగా పొడవుగా కూడా అవటం కాయం అంటున్నారు నిపుణులు. దీని కోసం మీరు పెద్దగా కష్ట పడక్కర్లేదు. కొద్దిగా మందార పొడి తీసుకుని అందులో ఉసిరి పొడి మరియు పెరుగు వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మీ జుట్టు అంతా కూడా ఈ పేస్ట్ ని పట్టించాలి.ఒక అర గంట పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత షాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది.

ఉపయోగం ఎలా?

అయితే మీకు దీని వల్ల ఎందుకు ప్రయోజనం కలుగుతుంది అంటే .. మందార పొడిలో ఎమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. అదే విధంగా ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది సర్క్యులేషన్‌కి సహాయ పడుతుంది అలానే జుట్టు రాలిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది అది ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది. మనం ఉసిరి పొడిని కావాలంటే ఇంట్లో తయారుచేసుకోవచ్చు. లేదంటే ఇది మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. అలానే మందార పొడి కూడా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఎక్కువ సమయం లేని వాళ్ళు ఆ పొడులను కొనుగోలు చేసి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. లేదా మీరే స్వయంగా పొడి చేసుకుని తీసుకుంటే ఇంకా బెటర్

మెంతులు, పెరుగుతో దృఢమైన, సిల్కీ జుట్టు :

ఇది మనకు తెలసిన విషయమే కానీ పెద్దగా పట్టించుకోం. ఈ పద్ధతి చాలా బాగుంటుంది. సిల్కీ హెయిర్ మరియు స్ట్రాంగ్ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ హెయిర్ ప్యాక్ ఇదే అని చెప్పవచ్చు.. పైగా ఎంతో సులువుగా ఎవరైనా ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. దీని కోసం మీరు ముందురోజు రాత్రి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులుని ఐదు టేబుల్ స్పూన్ల పెరుగులో వేసి నానబెట్టండి. గుర్తుంచుకోండి రాత్రంతా ఇది నానాలి. అప్పుడు ఉదయం లేచిన తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తలకు బాగా అప్లై చేయండి. ఒక గంట పాటు మీ జుట్టుని అలా వదిలేసి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. ఇలా తరుచూ చేస్తుంటే మీకు సిల్కీ, స్ట్రాంగ్ హెయిర్ వస్తుంది.

ప్రయోజనం ఎలా?

మెంతులలో ప్రొటీన్, ఐరన్, ఫ్లెవనాయిడ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది జుట్టును దృఢంగా చేస్తుంది. అదే పెరుగు అయితే జుట్టుని షైనీగా, సిల్కీగా చేస్తుంది. కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ కూడా మీకు బాగా ఉపయోగ పడుతుంది.

 ఆముదాన్ని తలకు రాయడం:

ఆముదం కూడా జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. అలానే కేశ సంరక్షణకి ఆముదం చాలా మంచిది. జుట్టుని అందంగా ఒత్తుగా ఉంచుతుంది. అదే విధంగా ఆముదంలో ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఇతర ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుని అందంగా షైనీగా ఇది మారుస్తుంది. చుండ్రు సమస్య లేకుండా ఆముదం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆముదాన్ని కూడా తలకి అప్పుడప్పుడు పట్టిస్తే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించటం జరిగింది..వీటిని మొదటిసారి వాడినప్పుడు ఎవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే ఆపేయండి.

Read more RELATED
Recommended to you

Latest news