రోజుకు ఎన్ని వెంట్రుకలు రాలితే సమస్య ఉన్నట్లు..?

-

తలను దువ్వుకున్న ప్రతిసారి జుట్టు ఎంతోకొంత ఊడుతుంది. జుట్టు రాలుతుంది, జుట్టు అంతా ఊడిపోతుంది అని చాలామంది అంటుంటారు. అసలు ఎంత జుట్టు ఊడితే అది సమస్యగా పరిగణించాలి..? నార్మల్‌గా జుట్టు ఊడటానికి, బాగా ఊడిపోవడానికి తేడా మీకు తెలుసా..? ఎందుకు తెలియదు.. నాలుగు ఐదు వెంట్రుకలు అయితే రాలడం కామన్‌. కానీ తలలో దువ్వెన పెట్టగానే.. గంతంత జుట్టు దువ్వెనకు చుట్టుకుని వస్తుందంటే.. అది సమస్యేగా అంటారా..? ఈరోజు మనం ఈ సమస్య గురించి ఫుల్‌గాతెలుసుకుందాం. ఎంత జుట్టు రాలితే కంగారు పడాలో, ఎంత జుట్టు ఊడితే లైట్‌ తీసుకోవాలో చూద్దాం.!

సగటు వ్యక్తి తలపై 1-1.2 లక్షల వెంట్రుకలు ఉంటాయి. దాదాపు 90 శాతం జుట్టు పెరుగుదల దశలో అనాజెన్ దశ అంటారు. ఎక్సోజెన్ దశలో రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సాధారణమైన ప్రక్రియ. రోజుకి 100 వెంట్రుకలు రాలడం ఫర్వాలేదు. కానీ కొందరికి రోజుకి 100 వెంట్రుకలు రాలిపోతూ వాటి సంఖ్య పెరిగిపోతుంటే అది కచ్చితంగా మంచిది కాదు. జుట్టు రాలడం అనేది వ్యక్తి నుండి వ్యక్తికి వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడానికి ఒకే కారణం ఉండదు. ఒకే చికిత్స లేదు. తల దువ్వినప్పుడు విపరీతంగా జుట్టు రాలడం, తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలడం, నిద్రపోయేటప్పుడు దిండుపై ఎక్కువ వెంట్రుకలు ఉండటం లాంటివి చూడొచ్చు. ఇది కచ్చితంగా సమస్యే.

మనిషి తనను తాను ఎక్కువగా సమస్యలు, చింతలకు గురిచేసుకి ఒత్తిడిని అనుభవిస్తాడు. దీంతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. స్టైల్ కోసం జుట్టును హీట్ చేయడం కూడా మంచిది కాదు. బ్యూటీ పార్లర్లలోనే కాదు ఇంట్లో కూడా దీన్ని ఎక్కువగా వాడడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. సాధారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కూడా జుట్టు రాలిపోవచ్చు. జుట్టును గట్టిగా కట్టుకోవడం జుట్టు రాలడానికి ప్రధాన కారణం. చుండ్రు, తల గోకడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. కెమికల్ హెయిర్ కలర్ ఉపయోగించడం వల్ల కూడా జుట్టు ఊసిపోతుంది. ఏదైనా ఇతర మందులు ఎక్కువ కాలం తీసుకుంటే, దాని రసాయనం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. అధిక జుట్టు రాలడం అనేది జన్యుపరమైన సమస్య. థైరాయిడ్ సమస్య జుట్టు రాలిపోయేలా చేస్తుంది.

జుట్టు రాలడం సాధారణ ప్రక్రియ అయినప్పటికీ, అధికంగా జుట్టు రాలడం మంచిది కాదు. మీ చేతులతో జుట్టు పట్టుకుని లాగండి. అలాంటప్పుడు చేతిపై పదికి పైగా వెంట్రుకలు వచ్చినట్లయితే వైద్యులను సంప్రదించాలి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఒకరోజు హెయిర్ ఫాల్ ఎక్కువై, మరుసటి రోజు జుట్టు రాలడం తగ్గితే బలహీనమైన జుట్టు చేతికి వచ్చినట్లే.. దానికి కంగారు పడాల్సిన పనిలేదు.

ఎలాంటి సమస్యకు అయినా సొల్యూషవ్‌ హెల్తీ లైఫ్‌స్టైల్‌ను మెయింటేన్‌ చేయడం. ఆనందంగా, ఎలాంటి టెన్షన్‌ లేకుండా, మంచి ఆహారం తీసుకోవాలి. మనిషి అన్నాకా.. ఎలాంటి చీకు చింత లేకుండా ఎలా ఉంటాయి అంటారేమో.. సమస్యలను పరిష్కరించాడనికి డబ్బు, మాటసాయం మాత్రమే పనికొస్తుంది. మీ చీకుచింత, ఆందోళన వల్ల పిసరంత సొల్యూషన్‌ కూడా రాదు. ఒక రోజు ఆందోళన చెందితే ఒక సమస్య తీరుతుందంటే..అందరూ అదే చేస్తారు కదా..! ముందు దేన్ని అయినా ఎదుర్కోనేలా, తీసుకునేలా మిమ్మల్ని మీరు మార్చుకోండి.

ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి. ఫైబర్, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పండ్ల రసం, కూరగాయల సలాడ్ తినండి. ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. మీ జుట్టును దుమ్ము, ధూళికి బహిర్గతం చేయకండి. వీలైనంత వరకు బయటికి వెళ్లేటప్పుడు మీ జుట్టును గుడ్డతో కప్పుకోండి. ధ్యానం, యోగా వంటి అభిరుచులు మీ ఒత్తిడికి లోనైన మనస్సును కూడా పరిష్కరించి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news