బొగ్గుతో ఫేస్ మాస్క్.. తళతళ మెరిసిపోవడానికే.. తయారు చేసుకోండిలా..

నల్లబొగ్గుతో పనేముంటుందని ఆలోచించే అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది. నల్ల బంగారంగా పిలవబడే బొగ్గు, మీ చర్మాన్ని తళతళ మెరిసిపోయేలా చేస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. బొగ్గులో విషపదార్థాలను లాక్కునే గుణం కలిగి ఉంటుంది. అందువల్ల చర్మంలోని విషపదార్థాలను బయటకు తీసివేస్తుంది. దానివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాదు అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బొగ్గుతో తయారయ్యే ఫేస్ మాస్కును ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం.

చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేసే బొగ్గు ఫేస్క్ మాస్కును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

1టేబుల్ స్పూన్ బొగ్గుపొడి
1టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి
2టేబుల్ స్పూన్ల నీళ్ళు
1/2టేబుల్ స్పూన్ తేనె
1 చుక్క మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్

తయారీ విధానం

అన్ని పదార్థాలను ఒక దగ్గర కలిపి మిశ్రమంగా చేయాలి. పూర్తిగా చిక్కబడ్డ మిశ్రమం మాదిరిగా అయిన తర్వాత మీ ముఖానికి వర్తించాలి. ఆ తర్వాత ఎండిపోయేదాకా అలాగే ఉంచుకుని కాసేపయ్యాక నీళ్ళతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మిల మిల మెరిసే చర్మం కావాలనుకునే వారు, అందమైన ముఖం కోసం ఈ బొగ్గు ఫేస్ మాస్కును ఉపయోగించవచ్చు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.