లీచి తొక్కతో స్కిన్‌కు బోలెడు లాభాలు.. తొక్కే కదా అని పడేస్తున్నారా..?

-

వేసవిలో శరీరాన్ని హైడ్రెట్‌గా ఉంచే పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. మరీ అదేపండ్లు అందానికి కూడా ఉపయోగపడితే.. మీ అందరికీ లీచి పండ్లు తెలిసే ఉంటుంది. ఇవి సమ్మర్‌లో బాడీని హైడ్రేట్‌గా ఉంచుతాయి. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఇవి ఎక్కువగా పండిస్తున్నారు. కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ పండ్ల వినియోగం తక్కువగానే ఉంది. లీచీలో విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లావిన్, బీటా కెరోటిన్, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. లిచీ పండును తిన్న తర్వాత, దాని తొక్కను అందరూ పక్కన పడేస్తున్నారు. కానీ ఈ తొక్క ద్వారా శరీరానికి చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అవేంటో చూద్దామా..!

లిచీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గర్భిణీలకు చాలా ప్రయోజనాలు
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది
ఊబకాయం తగ్గుతుంది
జీర్ణక్రియ మెరుగు పడుతుంది
గొంతు నొప్పిని తగ్గిస్తుంది

లిచీ పీల్స్ ప్రయోజనాలు:

మెడ మీద పేరుకుపోయిన మురికిని కూడా లీచి తొక్కతో క్లీన్‌ చేసుకోవచ్చు. దీనికోసం లీచి తొక్కలో మెత్తగా చేసి నిమ్మరసం, కొబ్బరి నూనె, పసుపు కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. అది మెడ చుట్టూ రాసి..కొద్దిసేపటికి రబ్‌ చేస్తూ క్లీన్‌ చేస్తే సరి.!

లీచీ తోక్కలను ఫేస్ స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం బియ్యప్పిండి, అలోవెరా జెల్, రోజ్ వాటర్‌ను మిక్సీ గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ముఖానికి మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగితే సరి…ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుందట.

చీలమండల మురికిని శుభ్రం చేయడానికి లిచీ పీల్ చాలా సహాయపడుతుందట.. దీని కోసం తొక్కను మెత్తగా రుబ్బుకోవాలి..ఆ తర్వాత ముల్తానీ మట్టి, ఆపిల్ వెనిగర్, బేకింగ్ సోడా అందులో కలపండి. దీన్ని చీలమండలపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

సో.. మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్‌ తిన్నప్పుడు తొక్కే కదా అని పడేయకుండా వాటిని ఈ విధంగా వాడుకోవచ్చు. లీచ్‌ పండు తొక్కే కాదు.. చాలా రకాల ఫ్రూట్స్‌లో తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అరటి తొక్క కూడా స్కిన్‌కు చాలా మంచిది.!

Read more RELATED
Recommended to you

Latest news