కళ్ళ అందాన్ని మరింత పెంచే కనుబొమ్మలని అందంగా చేసుకోండిలా..

కళ్ళు బాగుంటే ముఖం అందంగా కనిపిస్తుంది. కళ్ళు ఎంత విశాలంగా ఉంటే వారి అందం అంత విశాలమవుతుంది. మన కళ్ళతో చూసినపుడు అందంగా కనిపించే ముఖ భాగాల్లో ఎక్కువగా ఆకర్షించేవి కళ్ళే. కళ్ళు బాగున్నాయంటే కనుబొమ్మలు కూడా బాగున్నాయని అర్థం. కనుబొమ్మలు బాగుండక కేవలం కళ్ళు మాత్రమే బాగుండడం అనేది జరగదు. అందుకే ఐబ్రోస్ మీద చాలా దృష్టి పెడతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఐతే చాలా మందికి ఐబ్రోస్ ఒత్తుగా ఉంటేనే ఇష్టం.

ఒత్తుగా పెరిగి నల్లగా మెరిస్తే బాగుంటుందని అనుకుంటారు. కానీ కొందరికి ఐబ్రోస్ అంత ఒత్తుగా ఉండవు. పలుచగా ఉంటాయి. ఇలాంటి వారి అంత ఆకర్షణీయంగా అనిపించవు. అపుడు, వారు ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలని మార్కెట్లో దొరికే రకరకాల సాధనాలని వాడతారు. వాటి వల్ల ఫలితం ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే ఇంట్లో దొరికే వస్తువులతో ఐబ్రోస్ ని ఒత్తుగా ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

కొబ్బరి నూనె

తలకి కొబ్బరి నూనె ఎలా పెట్టుకుంటామో అలాగే కనుబొమ్మలకి కొబ్బరి నూనె పెట్టుకుంటే బాగుంటుంది. అందంగా మెరవాలని, ఒత్తుగా పెరగాలని, చూడగానే ఆకర్షించాలి అనుకున్న వారు కొబ్బరి నూనెని కనుబొమ్మలని అప్లై చేస్తే సరిపోతుంది. రాత్రిపూట పడుకునే ముందు కొబ్బరి నూనెని కనుబొమ్మలకి రాసి పొద్దున్న లేవగానే కడిగేయండి.

ఆముదం నూనె

ఆముదం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అందుకే కేశ సంరక్షణలో ఆముదం నూనెకి చాలా ప్రాముఖ్యం ఉంది. కొద్దిగా ఆముదం నూనెని తీసుకుని కనుబొమ్మలకి రాసి, ఒక పది నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే అందమైన కనుబొమ్మలు మీ సొంతం.

ఆలివ్ ఆయిల్

ఇది కూడా కనుబొమ్మలు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ రాసుకున్న తర్వాత కొద్ది సేపటికి కనుబొమ్మలని నీటితో కడుక్కోండి. కొన్ని రోజులు ఇలా చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి.