ఇంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

-

సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. అంతేకాదు ఇది చర్మ క్యాన్సర్ కు కారణం కావచ్చు. అందుకే బయటకి వెళ్ళేటపుడు సన్ స్క్రీన్ రాసుకోవాలని చెబుతారు. దీనివల్ల సూర్యకాంతి చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపకుండా ఉంటుంది. లేదంటే సూర్యకాంతిలో అతినీల లోహిత కిరణాల ఏ, బీ, సీ మొదలగునవి చర్మానికి అనేక రకాలుగా హాని కలిగిస్తాయి. చర్మం రంగుమారడం, దద్దుర్లు రావడం, ఒక్కో దగ్గర ఒక్కో రంగులో చర్మం కనిపించడం మొదలగునవి సూర్యకాంతి వల్ల కలిగే దుష్పరిణామాలు.

అలా అని పూర్తిగా సూర్యకాంతి పడకుండా ఉండకూడదు. ఎందుకంటే సూర్యకాంతిలో డి విటమిన్ ఉంటుంది. అది శరీరానికి చాలా అవసరం. అందువల్ల సన్ స్క్రీన్ పెట్టుకోవడం చాలా ఉపయోగకరం.

చర్మ రకాలను బట్టి ఎవరెవరు ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి?

జిడ్డు చర్మం ఉన్నవారు- నీటి ఆధారిత సన్ స్క్రీన్ లోషన్ తెచ్చుకోవాలి
పొడిచర్మం ఉన్నవారు- క్రీమ్ ఆధారిత సన్ స్క్రీన్ వాడాలి.
సాధారణం చర్మం గలవారు- ఏ రకమైన సన్ స్క్రీన్ అయినా వాడవచ్చు.
సున్నితమైన చర్మం కలవారు- ఖనిజాల ఆధారిత సన్ స్క్రీన్ వాడాలి.

సన్ స్క్రీన్ లో ఎస్ పీ ఎఫ్ ఎంత ఉండాలి?

ఎస్ పీ ఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ మంచిది. కావాలనుకుంతే ఎస్ పీ ఎఫ్ 50ఉన్న వాటిని కూడా వాడవచ్చు.

ఒక రోజులో మళ్ళీ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం ఉందా?

ఒకవేల మీరు బయట ఉన్నట్లయితే ప్రతీ రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవచ్చు.

ఇంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి?

ఇంట్లో ఉన్నప్పుడు సూర్యకిరణాలు శరీరం మీద పడకపోయినప్పటికీ, మనం ఉపయోగించే ఫోన్, ల్యాప్ టాప్ ల నుండి నీలి కాంతి చర్మంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news