ఎండలో బయటకి వెళ్తున్నారా? ఐతే ఈ వస్తువులను మీ బ్యాగులో ఉంచుకోండి..

-

వేసవి కాలం ఎండలు మండిపోతున్న సమయంలో బయటకి వెళ్ళడమనేది పెద్ద సమస్యగా మారుతుంది. ఊరికే ఏమీ జాగ్రత్తలు తీసుకోకుండా బయటకి వెళ్ళడం మంచిది కాదు. ఒకవైపు ఎండ, మరోవైపు మహమ్మారి రెండూ విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో కనీస జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. అందుకే బయటకి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే గనక మీతో పాటి మీ హ్యాండ్ బ్యాగులో కొన్ని వస్తువులని ఉంచుకోండి. ఆ ప్రత్యేకమైన వస్తువులేంటో వాటిని ఎందుకు ఉంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఫేస్ మాస్క్

మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మాస్క్ ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే మాస్క్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దు. కాటన్ మాస్క్ ఉపయోగిస్తే బాగుంటుంది. చర్మానికి చిరాకు కలిగించకుండా, శ్వాస పీల్చుకోవడానికి సులభంగా ఉండేలా చూసుకోండి. ఒకరోజంతా బయటే ఉండాల్సి వస్తే ఒకటికి మించి మాస్కులని బ్యాగులో ఉంచుకోండి.

నీళ్ళ బాటిల్

ఎండాకాలంలో శరీరంలో నుండి నీళ్ళు త్వరగా ఆవిరైపోతాయి కాబట్టి, ఎప్పటికప్పుడు శరీరానికి నీళ్ళు అందించాలి. దానికోసం మీ హ్యాండ్ బ్యాగులో ఖచ్చితంగా నీళ్ళబాటిల్ ఉంచుకోండి. అవసరం వచ్చినపుడు ఎక్కడైనా నీళ్ళు నింపుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

శానిటైజర్

కరోనా నుండి రక్షించుకోవడానికి మరో ముఖ్యమైన ఆయుధం శానిటైజర్. ప్రస్తుతం ఇది ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అది ఎల్లప్పుడూ మీ బ్యాగులోనే ఉండడం ఉత్తమం.

పర్ఫ్యూమ్

చెమట ఎక్కువగా వచ్చేవారు ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన సాధనం పర్ఫ్యూమ్. వేసవిలో చాలా తొందరగా జిడ్డుగా మారతారు కాబట్టి ఆ జిడ్డుతనం తాలూకు వాసన అవతలి వారికి రాకుండా ఉండాలంటే పర్ఫ్యూమ్ వాడాల్సిందే.

సన్ స్క్రీన్

బయటకి వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు చేయాల్సిన మొదటి పని, సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం. అవును, సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల నుండి మీ చర్మాన్ని కాపాడే సన్ స్క్రీన్ లోషన్ మీ బ్యాగులో ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news