చాలా మందికి వయసు మీద పడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇన్నాళ్ళు బ్రతికిన బ్రతుకు కూడా వాళ్ళకు అనవసరం అనిపించే సన్నివేశం వృద్దాప్యం వాళ్ళ వద్దకు వచ్చింది అని తెలుసుకోవడం. ముఖ్యంగా ఆడాళ్ళకు అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఆడాళ్ళు వృద్దులుగా కనపడటం ఒక శాపంగా భావిస్తూ దాని నుంచి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు.
ఇందుకోసం పార్లర్ కి వెళ్ళడం, జుట్టుకి రంగులు వేయించుకోవడం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తారు. అయితే అలాంటి వారికి అమెరికాలోని బ్రిగ్‌హామ్ యంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చేస్తున్నారు. వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరొద్దని అనుకునే వాళ్లకు వాళ్ళు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. కొవ్వు మోతాదు తక్కువగా ఉండే టోన్డ్ పాలు తాగాలని సూచిస్తున్నారు.
5,834 మంది యుక్త వయస్కులపై కొన్నేళ్ల అధ్యయనం చేసిన వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించారు. కొవ్వు అధికంగా ఉండే పాలు తాగేవారితో పోల్చుకుంటే టోన్డ్ పాలు తాగే వారిలో వృద్ధాప్య లక్షణాలు నాలుగేళ్లు ఆలస్యంగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు సాధారణంగా కణ విభజన జరిగినప్పుడు… టెలోమెర్ల పొడవు తగ్గిపోతుంటుంది. కాని టోన్డ్ పాలు తాగేవారిలో టెలోమెర్ల పరిమాణం తగ్గే వేగం చాలా తక్కువగా ఉన్న నేపధ్యంలో వృద్ధాప్య ఛాయలు కనిపించడం ఆలస్యమవుతుందని గుర్తించారు.