ఇంటి నుంచే వ్యాపారం..రూ.5 వేల పెట్టుబడి ఉంటే చాలు.. నెలకు రూ. లక్షల్లో ఆదాయం..!!

-

చిన్నదో పెద్దదో ఉద్యోగం కంటే ఏదైనా వ్యాపారం చేయడం ఉత్తమం అని ఈరోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. వ్యాపారం చేయాలంటే.. లక్షల్లో పెట్టుబడి ఉండక్కర్లా.. మంచి ఆలోచన కష్టపడే తత్వం ఉంటేచాలు.. చిన్నపాటి పెట్టుబడితో అయినా వ్యాపారం మొదలుపెట్టొచ్చు. వ్యాపారం రంగంలోకి ప్రవేశించి సొంత ఊళ్లో ఉండే చేసే చక్కని బిజినెస్ ఐడియా ఉంది. ఇందులో పెద్దగా ఇన్వెస్ట్ మెంట్ కూడా పెట్టకర్లేదు. ఏమి అవసరంలేదు. అంతేకాక నెలకు లక్షల్లో సంపాదించొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ అంటే ఎవరు కాందటారు. మరి.. ఆ వ్యాపారం ఏమిటి? ఆ వివరాలు ఏంటో చూద్దామా..
మన చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎన్నో వ్యర్ధ వస్తువులు ఉంటాయి. ఇవే మనం చేసే వ్యాపారాన్ని ముడి సరుకు. ఈ వేస్ట్ మెటిరీయల్ బిజినెస్ ద్వారా మంచి లాభాలు వస్తాయనే విషయం గ్రహించాలి. మన పరిసరాల్లో ఉంటే వేస్ట్ మెటీరియల్స్‌ను సేకరించాలి. అంత అవగాహన లేకుంటే స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్ వారిని కలవచ్చు. వారి ద్వారా వేస్ట్ మెటిరియల్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు… అంతేకాక వాటితో ఏ ఏ వస్తువులు తయారు చేయోచ్చో మనకు ఓ అవగాహన వస్తుంది. సామాజిక మాద్యమాల్లో చూడటం, వీటితో ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారిని కలిసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.
రీసైక్లింగ్ చేసిన వస్తువులకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. జనాలు ఇలాంటి వస్తువులను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 బిలియన్ టన్నుల వ్యర్ధ వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో ఒక ఇండియా వాటానే 277 మిలియన్ టన్నులు. ఇక్కడ చెత్త, వ్యర్ధాలు ఎంత మేరకు ఉత్పత్తి అవుతున్నాయో ఈ గణాంకాలే నిదర్శనం.
వీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా.. చాలా వస్తువులు తయారు చేయవచ్చు. పెయింటింగ్స్, ఇంటిరియర్ వస్తువులు, మరికొన్ని ఇతర వస్తువలను తయారు చేయవచ్చు. వీటిని అమ్మడం ద్వారా బాగా డబ్బులు సంపాందించే అవకాశం ఉంది.. ఈ వ్యాపారానికి ప్రధానమైనది చెత్తను సేకరించడమే. ఇది మనకు కొంతమేరకు ఉచితంగా దొరికినప్పటికి.. వ్యాపారం కోసం మరికొంత డబ్బు పెట్టాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వ్యర్ధ వస్తువులను సేకరించి.. వాటిని తొలుత శుభ్రపరచాలి. అనంతరం వాటితో కొత్త డిజైన్‌లు తయారు చేయవచ్చు.
వెరైటీ రంగులతో వినియోదారులును ఆకర్షించేలా చేయవచ్చు. అలా తయారు చేసిన వాటిని ఆన్ లైన్ ద్వారా కూడా విక్రయించవచ్చు. మనం వాటిని రీసైక్లింగ్ చేసేందుకు మాత్రం కొంత ఖర్చు అవుతుంది. అది కూడా 5 వేల నుంచి 10 వేలలోపే అవుతుంది. అంతేకాక వినియోదారులను ఆకర్షించి మన వస్తువులకు సేల్స్‌ పెరిగితే.. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. అయితే ఏ వ్యాపారం చేసే ముందు అయినా ఆ బిజినెస్‌పై మంచి అవగాహన ఉండాలి.. ఒకవేళ లేకుంటా.. ఉన్నవారిని అడగాలి.. ఏం తెలుసుకోకుండా మాత్రం దిగకూడదు..!

Read more RELATED
Recommended to you

Latest news