బిజినెస్ ఐడియా: టీ బండితో లక్షల్లో లాభాలు..!

-

మీరు ఏదైనా వ్యాపారం ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా..? ఏ వ్యాపారం చేయాలి అనేది అర్థం కావడం లేదా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయితే చక్కగా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

 

టీ కొట్టు పెట్టి మంచిగా ఆదాయాన్ని పొందొచ్చు. నిషా హుస్సేన్ అనే ఒక అమ్మాయి టీ కొట్టు నడుపుతోంది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పది రకాల టీలను ఈమె అమ్ముతోంది. అయితే ఆమె టీ కొట్టు పెట్టడానికి ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. 2017 లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆమె రాజీనామా చేసి ఎవరికి తెలియకుండా రహస్యంగా టీ కొట్టు పెట్టింది.

మొదట్లో కస్టమర్స్ ఎవరూ లేనప్పటికీ ఆ తర్వాత క్రమంగా వ్యాపారాన్ని పెంచుకుంది. మొదట్లో ఎవరూ తన కొట్టు కి రాలేదని… ఒకసారి ఒక ఆమె ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారని అప్పటి నుండి కూడా జనం విపరీతంగా పెరిగారు అని ఆమె చెప్పారు. ప్రతి నెలా కనీసం 50 వేల రూపాయల వరకు ఈమె సంపాదిస్తోంది. ఇలా చిన్న చిన్న వ్యాపారం మొదలు పెడితే ఎవరైనా మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. అయితే కష్టపడుతూ మంచిగా నడుచుకోవడం ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news