తెలంగాణ రాష్ట్రంలో జరుగుతన్న రైల్వే పనులకు సహకరించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 2022-23 బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే కేటాయింపులు అధికంగా వచ్చాయని అన్నారు. గతంతో పోలిస్తే.. ఈ ఏడాదే ఎక్కువ వచ్చాయని అన్నారు. కానీ ఈ రైల్వే పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా ఇవ్వడం లేదని, అలాగే భూమి సేకరించే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తుందని లేఖలో సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
కాగ రాష్ట్రంలో ప్రస్తుతం 1,300 కిలో మీటర్లు కు పైగా.. రైల్వే పనుల్లో ఆలస్యం అవుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైల్వే లను మరింత దగ్గర అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. కాగ రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త లైన్లు, డబ్లింగ్ తో పాటు కొన్ని చోట్ల.. మూడో లైన్, విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయని లేఖలో తెలిపారు.