క్లౌడ్ కిచెన్: రాబోయే రోజుల్లో అత్యధికంగా గిరాకీ ఉన్న వ్యాపారం..

-

ఈ మధ్యే కొత్తగా వచ్చిన సినిమాలో ఒకానొక డైలాగ్ ఉంటుంది. ఒక తరంలో రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంది. మరో తరంలో సాఫ్ట్ వేర్ బూమ్ అందుకుంది. భవిష్యత్తులో వ్యవసాయం బూమ్ అందుకుంటుంది అని. అది నిజమే. కరోనా వల్ల ఈ విషయం చాలా మందికి తెలిసి వచ్చింది. కరోనా కారణంగా అన్ని పనులు మూతబడ్డాయి గానీ, వ్యవసాయం మాత్రం పడలేదు. బ్రతుకు చక్రం వెళ్ళదీయాలంటే కావాల్సింది ఆహారమే అయినపుడు దాన్ని ఎలా ఆపగలం. దీనివల్లనో ఏమో గానీ, ఆహార రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి.

ఇప్పటికే జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ఆహారాన్ని ఇంటికే తెచ్చిస్తున్నాయి. మరికొద్ది కాలంలో ఇంట్లో అసలు వండుకోవడం మానేస్తారేమో. ఇద్దరు భార్యా భర్తలు ఒక్కరు పని చేయకపోయినా బ్రతకలేని పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి రోజు వస్తుందనుకోవడంలో పెద్దగా సందేహించాల్సిన పనిలేదు. తాజాగా క్లౌడ్ కిచెన్ అనే కొత్త వ్యాపారం ప్రారంభమైంది. క్లౌడ్ కిచెన్ అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు. ఇది కూడా జొమాటో లాంటిదే. కానీ ఇక్కడ ఆహారం రెస్టారెంట్ల నుండి సర్వ్ చేయబడదు.

కిచెన్ ఎక్కడో ఉంటుంది. దీన్ని మొదలు పెట్టినవారు వారి ఇంట్లోనే ఉండి మొదలు పెట్టవచ్చు. రెస్టారెంట్ సౌకర్యం లేకుండా మొదలుపెట్టి ఆన్ లైన్ ద్వారా వినియోగదారులకి తమ ఆహారాన్ని చేర్చడమే దీని లక్ష్యం. అంటే ఇది మొదలు పెట్టడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదన్నమాట. రెస్టారెంట్ సౌకర్యం లేదు కాబట్టి ఫర్నీచర్ గురించి ఆలోచించాల్సిన పనేలేదు. హాయిగా ఒక దగ్గర కిచెన్ ఏర్పాటు చేసుకుని వినియోగదారుడికి కావాల్సిన ఆహారాన్ని ఆన్ లైన్ లో డెలివరీ చేయడమే.

ప్రస్తుతం ఈ బిజినెస్ బాగా ట్రెండింగ్ లో ఉంది. పైగా ఖర్చు కూడా తక్కువ. కాకపోతే ఎఫ్ ఎస్ ఎస్ ఎస్ ఏ ఐ నుండి అనుమతి తెచ్చుకుంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news