అలాంటి వీడియోలు చేసి.. కుటుంబ కష్టాలు గట్టెక్కించిన అక్కాచెల్లెల్లు

-

ఇంట్లో చాలా వస్తువులు వాడిపడేసినవి ఉంటాయి.. వాటిని పారేయలం.. అలా అని తిరిగి వాడలేం.. ఇలా ఉండిపోతాయి. పాత గాజులు, వాడి పడేసే టూత్‌బ్రష్‌ ఏదీ వృథా కాదంటున్నారీ అక్కాచెల్లెళ్లు. వాటిని ఆకర్షణీయ వస్తువులుగా ఎలా మార్చవచ్చో వివరిస్తూ వీడియోలు చేసి.. యూట్యూబ్‌లో పెట్టి తమ జీవితాలనే మార్చేసుకున్నారు. కష్టాలు గట్టెక్కాయి.. వీరి రియల్ స్టోరీ ఎంతో మందికి ఆదర్శం.

స్నేహ, పూజ ఇద్దరూ అక్కాచెళ్లెల్లు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేదని.. ఏదైనా చేయాలనుకున్నారు. అప్పటికే వారికి కళాకృతుల తయారీలో మంచి సృజన ఉంది. వృథా వస్తువులతో ఏమేం తయారు చేయొచ్చో చూపిస్తూ వీడియోలు తీసి యూట్యూబ్‌(ఆర్ట్‌ కళ ఛానెల్‌)లో పెట్టారు.

2016 సెప్టెంబరులో ప్రారంభించినప్పుడు స్పందన అంతంత మాత్రమే ఉండేది.. అయినా నిరుత్సాహపడలేదు. పాత వస్తువులతో ఆకర్షణీయ దీపాలు ఎలా చేయాలో చూపిస్తూ దీపావళి సమయంలో ఓ వీడియో పెట్టారు. దానికి ఊహించని స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తర్వాత క్రమంగా సబ్‌స్క్రైబర్లూ పెరిగారు. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 45 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

పాత ప్లాస్టిక్‌ జార్‌, టూత్‌బ్రష్‌లు, గాజులతో అలంకరణ వస్తువుల తయారీపైన చేసిన వీడియోల్లో ఒక్కోదానికి కోటికిపైనే వ్యూస్ వస్తున్నాయంటే.. క్రేజ్ ఏ లెవల్లో ఉందే మీరే ఆలోచించండి. వీరి వీడియోల్ని చూస్తూ అలాంటి ఉత్పత్తుల్ని తయారుచేసి వ్యాపారులుగా మారినవాళ్లూ ఉన్నారట. ప్రస్తుతం నూనె లేకుండా పచ్చళ్ల తయారీ లాంటి వంటింటి చిట్కాలూ చెబుతున్నారు.ఈ అక్కా చెల్లెల్లు. వీరికి తమ్ముడు పవన్‌ కూడా సాయపడతాడు.

వీరి యూట్యూబ్‌ ఛానెల్‌ ఆదాయంతో కుటుంబ ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. ‘ఈ స్థాయి విజయం దక్కుతుందని అస్సలు ఊహించలేదట. మొదటి నెల మా ఆదాయం రూ.400. అయినా నిరుత్సాహపడకూడా ప్రయత్నించారు.. ఈరోజు సరిపడేంత వస్తుందంటున్నారు.

పట్నాలో ఆఫీసు స్టాట్ చేశారట.. దాని ద్వారా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు.. వీరు ఎదిగిన తీరుని యూట్యూబ్‌ సైతం ప్రశంసించింది. ఏదైనా కంటెంట్‌ని సృష్టించాలనుకునేటప్పుడు దేనికి డిమాండ్‌ ఉంటుందో గమనించి అడుగు వేయాలని…ఎదుగుతున్న క్రమంలో చాలా విమర్శలు వస్తాయి. వాటిలోని మంచిని మాత్రమే తీసుకోని. వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలంటున్నారు ఈ అక్కా చెల్లెల్లు.

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని అందరికీ ఉంటుంది. మొదట్లో విమర్శలే వస్తాయి. కానీ వాటిని పట్టించుకోకుండా ముందు కెళ్లిన వారే..ఈరోజు కవర్ స్టోరీ అవుతారు. మన తెలుగులో కూడా ఎంతో మంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news