60శాతం నీటిని ఆదా చేస్తూ ఎకరంన్నర భూమిలో లక్షలు సంపాదిస్తున్న రైతు..

-

వ్యవసాయానికి నీళ్ళు చాలా కావాలి. ఇది చాలా మంది సాంప్రదాయ వ్యవసాయ పద్దతులు వాడే రైతులు మాట్లాడే మాట. కాని శాస్త్రీయ పద్దతుల ద్వారా వ్యవసాయం చేయడం నేర్చుకుంటే ఎంతో నీటిని ఆదా చేయవచ్చని, పెద్దగా భూమి లేకపోయినా లక్షలు సంపాదించే అవకాశం ఉందని నిరూపించాడు రాజస్థాన్ కి చెందిన శంకర్ జాట్ అనే రైతు.

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలోని సలేరా గ్రామంలో నివసిస్తున్న శంకర్ జాట్, తనకున్న 1.25ఎకరాల భూమిలో టమాటలు పండించాడు. మొదట్లో వాటి గురించి పెద్దగా తెలియకపోవడంతో కేవలం 60వేల రూపాయలు మాత్రమే సంపాదించగలిగాడు. ఆ తర్వాత శాస్త్రీయ పద్దతులు తెలుసుకుని అదే భూమిలో ఏడాదికి 4లక్ష్ల వరకు సంపాదిస్తున్నాడు. దీనికోసం అతడేం చేసాడో తెలుసుకుందాం.

ఇండియన్ అగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (BAIF) సహాయంతో శాస్త్రీయ పద్ధతుల ద్వారా వ్యవసాయంలో శిక్షణ పొందిన శంకర్ 1057టమాట రకాన్ని వేసి మల్చింగ్, బిందు సేద్యం పద్దతులను ఉపయోగించాడు. వాటివల్ల టమాట దిగుబడి అధికంగా ఉంది. అంతే కాదు, పేడ, మూత్రం, నీరు, సత్తుబెల్లం ఉపయోగించి జీవామృతాన్ని తయారు చేసి పంటకి అందించాడు.

తన భూమిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి సిస్టమేటిక్ ప్లాంటేషన్ ని ఉపయోగిస్తున్నాడు. మల్చింగ్ విధానం ద్వారా 60శాతం నీరు ఆదా అవుతుంది. ఈ పద్దతి వల్ల ప్రతీ రోజూ 20నిమిషాల పాటు నీరు పారిస్తే చాలు. మిగతా భూమిలో గోధుమలు పండిస్తూ అదనపు లాభాన్ని పొందుతున్నాడు. మొదట్లో మల్చింగ్ పెట్టుబడికి ఇతరుల దగ్గర అప్పు చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఈ కొత్త పద్దతుల వల్ల లాభం బాగుందని, చుట్టు పక్కల వాళ్ళు తన దగ్గరకొచ్చి పంట విధానాలు తెలుసుకుంటున్నారని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news