బిజినెస్ ఐడియా: కొబ్బరి బొండాల వ్యాపారంతో అదిరిపోయే లాభాలు పొందండిలా..!

మీరు ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక మంచి ఐడియా. బిజినెస్ చిన్నదైనా మంచిగా లాభాలు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. కొబ్బరి బొండాల వ్యాపారం(Coconut Business) చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది నిజమేనండి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక యూనివర్శిటీ రోడ్డు పక్కన ఓ కొబ్బరి బోండాల బండి ఇద్దరు బ్రదర్స్ మొదలు పెట్టారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ వచ్చాక వీళ్ళు సరి కొత్త ఆలోచన తో వ్యాపారాన్ని డెవెలప్ చేసుకోవడం మొదలు పెట్టారు. దీనితో వాళ్ళు కొబ్బరి నీళ్లను ఇళ్లకే సరఫరా చేయడం మొదలు పెట్టారు. ఆ బండికి ఓ భారీ బ్యానర్ కూడా కట్టారు

ఎవరైనా కనుక పది కంటే ఎక్కువ బోండాలు ఆర్డర్ చేస్తే వారికీ ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తామని మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు. ఇలా తమ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేసారు. అంతే కాకుండా ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, షేర్‌చాట్, కూ వంటి సైట్లలో మొబైల్ నంబర్ ఇచ్చి ఆర్డర్స్ తీసుకుంటున్నారు.

ఇలా వీళ్లు లీటర్ బాటిళ్ల లో కొబ్బరి నీళ్లను నింపి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇలా బిజినెస్ బాగుంటోంది. ఇలా ఈ బిజినెస్ చేసి వీళ్ళు దూసుకెళ్లి పోతున్నారు. మంచిగా రాబడి కూడా వీళ్ళకి వస్తోంది.