ఆన్ లైన్ ఆహార డెలివరీ సంస్థలకి ఎలా లాభాలు వస్తాయో తెలుసా..?

-

ఇంతకుముందు ఇంట్లో వంట చేసుకోకపోతే ఎక్కడ రెస్టారెంట్ ఉందో వెతుక్కుని మరీ వెళ్ళాల్సి ఉండేది. అక్కడకి వెళ్ళాక మనకి కావాల్సింది లేకపోతే మళ్ళీ మరో చోటికి వెళ్ళలేం కాబట్టి, అక్కడ ఉండే స్పెషల్ ఏదైనా తిని వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏది కావాలన్నా మన గడప దగ్గరకే వచ్చేస్తుంది. ఫుడ్ కూడా ఇంటి తలుపు తడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అనుకోనివి జరగడమే వింత కాబట్టి, ఇప్పుడు ఆ వింత కూడా మనకు బాగా అలవాటైపోయి మామూలు విషయమైపోయింది.

ఐతే చాలా మందికి ఉన్న సందేహమేమిటంటే, ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ డెలివరీ చేసే సంస్థలకి ఏ విధంగా లాభం వస్తుంది? రెస్టారెంట్లలో సేమ్ రేటుకి దొరికే ఒక వస్తువు, ఆన్ లైన్లో ఆర్డర్ చేసినా అదే ధరకి, ఒక్కోసారి అంతకన్నా తక్కువ ధరకి లభిస్తుంది. అలాంటప్పుడు డెలివరీచేసే వాళ్ళకి లాభాలు ఎలా వస్తాయనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి చాలా మందికి తెలిసిన సమాధానాలు కొన్ని ఉన్నాయి. ముందుగా, రెస్టారెంట్లతో ఈ ఆన్ లైన్ డెలివరీ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కస్టమర్ డైరెక్టుగా వెళితే ఒక రేటు, ఈ ఆన్ లైన్ వాళ్ళకి మరో రేటు ఉంటుంది. అదొక విధానం.

ఇంకా, ఆన్ లైన్ యాపుల్లో అనేక అడ్వర్టైజ్ మెంట్లు వస్తుంటాయి. రికమెండెడ్ అని చెప్పి ఏవేవో సైట్ల యాడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ యాడ్ కి కూడా డబ్బులు వస్తాయి. ఇది రెండవ పద్దతి. ఇక మూడవ పద్దతి రెస్టారెంట్ ఓపెన్ చేయడం. అవును, ఆన్ లైన్ యాపులు ఎక్కడ ఏ రకం ఫుడ్ ఎంత మార్కెట్ అవుతుందో అంచనా వేసుకుని, ఆ స్థలాల్లో రెస్టారెంట్లని ఓపెన్ చేస్తుంది. అవి కస్టమర్లు రావడానికే కాకుండా డెలివరీకి పనిచేస్తాయి. దానివల్ల మరింత లాభం ఉంటుంది. ఇలా మూడు రకాలుగా వారు లాభాలు ఆర్జిస్తాయి. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి, వినియోగదారులని ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం అంతగా ఉండకపోవచ్చని కొంతమంది వాదన.

Read more RELATED
Recommended to you

Latest news