ఆంధ్రప్రదేశ్ సరికొత్త నిర్ణయం. మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు..

-

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం ఒకింత గందరగోళానికి గురి చేస్తుంది. కరెక్టుగా లాక్డౌన్ ప్రకటన జరిపి సంవత్సరం అవుతున్న ఈ రోజున లాక్డౌన్ల గురించిన మాటలు మళ్ళీ మళ్ళీ వినిపించడం సామాన్య జనాల్లో అనేక సందేహాలకు దారి తీస్తున్నాయి. సెకండ్ వేవ్ ఇప్పుడే మొదలయ్యిందంటూ వస్తున్న వార్తలు ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మాస్కులు ధరించాలంటూ మరో మారు ప్రకటన చేసింది. మాస్కులు లేకుండా పబ్లిక్ లో కనిపిస్తే వెయ్యిరూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ జరిమానా రేపటి నుండి అమల్లోకి రానుందని సమాచారం.

ఇప్పటికే కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు మళ్ళి కరోనా కారణంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాని వ్యాప్తిని అరికట్టాలన్న ఉద్దేశ్యంతో కఠిన నియమాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వ్యాక్సిన్ కూడా వచ్చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు పెరగడం అందరికీ భయంగానే ఉంది. ఏది ఏమైనా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా బస్సులు రవాణా మొదలగు వాటన్నింటినీ శానిటైన్ చేసి, జనాలకి ఇబ్బంది కలగకుండా చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news